రమ్మీలో 13 కార్డ్స్ గేమ్-21 కార్డ్స్ గేమ్
రమ్మీ అనేది ఎన్నో రకాలతో కూడిన గేమ్. ఇందులో ఇండియన్ రమ్మీ, జిన్ రమ్మీ, రమ్మీ 500, ఇంకా ఎన్నో రకాలు ఉంటాయి. మళ్లీ వీటిలో ఒక్కొక్క దానిలోనూ వేర్వేరు రకాల గేమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఒక నిర్ధిష్ట అంశంలో ఆ యా గేమ్స్ యొక్క ప్రాథమిక నియమాలకు భిన్నంగా ఉండే వివిధ రకాల గేమ్స్ అయి ఉంటాయి.
ఒక నిర్ధిష్ట అంశంలో కొద్ది తేడాలు కలిగి ఉంటూ, రెండు దగ్గర దగ్గరగా ఉన్న రమ్మీ రకాల్లో 13 కార్డుల రమ్మీ, 21 కార్డుల రమ్మీ గేమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
ఈ రెండు రకాల్లోని తేడాలను ఈ క్రింద పాయింట్స్ ద్వారా మీకు అర్థమయ్యేలా చేయడానికి మేం సహాయపడతాం.
ఈ రకం రమ్మీలో ఆడాల్సిన కార్డుల సంఖ్య
ఈ విషయం మనకి చాలా తేలిగ్గా తెలిసిపోతుంది. పేర్లు సూచించినట్టుగానే, ఈ రెండు రకాల రమ్మీ గేమ్ నీ ప్రారంభించినప్పుడు వివిధ నెంబర్లతో కూడిన కార్డులు ఉంటాయి. 13 కార్డుల రమ్మీలో ఒక్కో ప్లేయర్ 13 కార్డులతో ఆడతాడు. 21 కార్డు రూముల్లో ఒక్కో ప్లేయర్ 21 కార్డులతో ఆడతాడు.
గేమ్ ఆడే వేగం
రమ్మీలో, అన్ని కార్డుల్నీ వాలిడ్ సెట్స్, సీక్వెన్సుల్లో అమర్చాల్సి ఉంటుంది. మామూలుగా అయితే, మన చేతిలో ఉన్న కార్డుల సంఖ్యే ఎన్ని సెట్స్ లేదా సీక్వెన్సులు తయారు చేయాలో నిర్ణయిస్తుంది. మన చేతిలో తక్కువ సంఖ్యలో కార్డ్స్ ఉన్నప్పటి కంటే, ఎక్కువ సంఖ్యలో కార్డులుంటే, సహజంగానే మనం ఎక్కువ సెట్లు లేదా సీక్వెన్సులు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక 13-కార్డు వెర్షన్, 21-కార్డు వెర్షన్ కంటే వేగంగా పూర్తి అవుతుంది. మిగతా కారకాలన్నీ సమానంగా ఉంటాయి.
గేమ్‌కి ఉపయోగించే డెక్స్ సంఖ్య
21 కార్డ్ రకం గేమ్ కి ఎక్కువ కార్డులు అవసరం కాబట్టి, మూడు డెక్స్ తో ఆడతారు. 13 కార్డులతో ఆడే గేమ్ ని రెండు డెక్ కార్డులతో ఆడతారు. మూడవ డెక్ కార్డులుంటే 21-కార్డ్స్ గేమ్ మరి కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది.
ప్యూర్ సీక్వెన్సులు
13-కార్డుల రమ్మీలో, మీరు ఒక ప్యూర్ సీక్వెన్స్, ఒక ఇంప్యూర్ సీక్వెన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే 21-కార్డుల రమ్మీకి కనీసం మూడు ప్యూర్ సీక్వెన్సులు కావాలి.
జోకర్ పాత్ర
రెండు రకాల గేమ్స్ లోనూ జోకర్ పాత్ర స్థూలంగా ఒకేలా ఉంటుంది. సీక్వెన్సుల సెట్ లను ఏర్పరచడంలో సహాయపడేందుకు ఏదైనా కార్డును జోకర్ రీప్లేస్ చేయవచ్చు. తేడా ఏమిటంటే 21-కార్డుల రమ్మీలో కూడా జోకర్ గా పని చేసే వేల్యూ కార్డులు ఉంటాయి. వాటికి అదనపు పాయింట్లు ఉంటాయి.
మేరేజ్ హ్యాండ్
21-కార్డ్ వెర్షన్ లో వేరే రకం ఆట కూడా ఉంది. దీనికి మేరేజ్ హ్యాండ్ అని పేరు. ఇది మరింత పోటీగా ఉండే ఆట. ఇది 21-కార్డు వెర్షన్ లో మాత్రమే కుదురుతుంది తప్ప 13-కార్డ్ వెర్షన్ లో కుదరదు. ఒక మేరేజ్ హ్యాండ్ అంటే అన్ని వేల్యూ కార్డుల్నీ కలిగి ఉన్న హ్యాండ్ అని అర్థం.
ఆన్లైన్ వెర్సెస్ ఆఫ్ లైన్ గేమ్‌ప్లే
13-కార్డ్ రమ్మీ, 21-కార్డ్ రమ్మీ, ఈ రెండు రకాలూ ఆన్లైన్లో విస్తృతంగా అందుబాటులో ఉంటాయి. అయితే, గేమ్ వేగంగా పూర్తయ్యే లక్షణం కారణంగా, 13-కార్డు రమ్మీని మరింత తరచుగా ఆడతారు.
రెండు రకాలైన రమ్మీకీ మధ్య గల ప్రాథమికమైన తేడాలను ఈ ఆర్టికల్ మీకు అందించిందని మేం భావిస్తున్నాం. ఈ రెండు రకాల గేమ్స్ నీ చెక్ చేయండి, రమ్మీకల్చర్ వంటి సుప్రసిద్ధమైన ఫ్లాట్ ఫారంలో వాటిని ఆన్లైన్లో ఆడండి.