ఈ దీపావళినాడు ఆడడానికి 4 మంచి కార్డ్ గేమ్స్

మీ చిన్ననాటి రోజులు గుర్తున్నాయా, దీపావళి వస్తోందంటే చాలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ వచ్చేవారు, అంతా కలిసి పండుగ సందర్భంగా రుచికరమైన వంటలు, పిండివంటలతో విందులు చేసుకోవడం, టపాసులు కాల్చడం, దాంతో పాటే కొన్ని రౌండ్లు మీకిష్టమైన కార్డ్ గేమ్ ఆడడం వంటి పనులు చేసేవారు కదా. ఇప్పుడు కాలం మారింది, ప్రజలు ఇప్పుడు దీపావళి పండుగని కొంచెం భిన్నంగా జరుపుకోవచ్చు, కానీ దీపావళి నాటి రాత్రి కార్డ్స్ ఆడే సరదా మాత్రం వారికి అలాగే ఉంది.
నిజంగానే సుమా, కొన్ని మంచి, పాత కాలం నాటి రమ్మీ లేదా తీన్ పత్తీ ఆడకుండా దీపావళి పూర్తి అయినట్టు కాదు. ఇది కేవలం గొప్ప సరదానిచ్చే ఆటే కాక, భారతీయుల్లో అనేకమంది ఇళ్లల్లో ఇదొక సంప్రదాయం కూడా. ఈ దీపావళికి ముందు, ఈ సీజన్లో మీ కుటుంబంతో ఆడుకోవడానికి మీరు మిస్ చేయకూడని 4 అత్యంత ప్రాచుర్యం పొందిన కార్డ్ గేమ్స్ గురించి ఇక్కడ వివరించబడుతోంది.
రమ్మీ
రమ్మీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడుకునే కార్డ్ గేమ్, దానికి పరిచయం అవసరం లేదు. ఇందులో ఎన్నో రకాల ఆటలున్నా, అందరికీ బాగా తెలిసిన రమ్మీ ఆటని ఆడుకుంటూనే మనందరం ఇంత పెద్దయ్యాం.
రమ్మీ బాగా ప్రాచుర్యం పొందడానికి కారణమేమంటే, అది కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని ఆడేందుకు వీలున్న గేమ్. క్రొత్తవారు కూడా నియమాల్ని చాలా సులభంగా అర్థం చేసుకోగలరు. ఈ ఆట ఆడడానికి గేమ్‌లో నిష్ణాతులై ఉండవలసిన అవసరం లేదు.
మర్చిపోవద్దు, రమ్మీకల్చర్ వంటి ప్లాట్‌ఫాంలు భారతదేశంలో అత్యంత విశ్వసనీయ రమ్మీ సైట్లో ఆన్లైన్లో రమ్మీని ఆడడం గతంలో కంటే సులభతరం చేశాయి.
UNO
ఇంతకు ముందు UNO ఆడనిదెవరు? ఈ క్లాసిక్ కార్డ్ గేమ్ పిల్లలకీ, పెద్దలకీ కూడా బాగా నచ్చుతుంది. 7 లేదా అంతకు మించిన వయస్సు గల ప్లేయర్లు 2 నుంచి 10 మంది దాకా ఉండి ఆడుకోవడానికి మంచి ఆట ఇది. ఈ గేమ్ గతంలో మంచి ఆటవిడుపు కాలక్షేపం గేమ్‌గా ఉండేది.
ప్రత్యేకంగా ప్రింట్ చేయబడిన డెక్‌తో ఆడబడే ఈ గేమ్ గత 3 దశాబ్దాలుగా ఒక అధికారిక మాట్టెల్ బ్రాండ్. ఒరిజినల్‌గా ఇది 1971 లో ఫ్యామిలీ గేమ్‌గా అభివృద్ధి చెందింది, స్నేహితులు ఆడుకునే ఆటగా దీనికి బాగా ఆదరణ పెరగడంతో దీన్ని కనిపెట్టిన మెర్లే రాబిన్స్ 5000 సెట్స్‌ని లాభం కోసం అమ్మారు.
పోకర్
అత్యంత ప్రాచుర్యం పొందిన కార్డ్ గేమ్‌లలో ఒకటైన పోకర్ ప్రజలందరూ బాగా అభిమానించే మరో గేమ్. రమ్మీకి పోటా పోటీగా ఉండే ఈ గేమ్‌ని కూడా ప్రజలు ఎప్పుడూ ఆడుతుంటారు.
ఈ దీపావళికి మీ స్నేహితులు కార్డ్స్ ఆడడానికి గానీ వస్తున్నట్లయితే, వారు ప్రత్యేకంగా పోకర్ ఆడాలని కోరుకునే అవకాశాలు ఉన్నాయి, ఈ గేమ్‌కి అంత అపారమైన ప్రజాదరణ ఉంది!
పోకర్ కూడా చాలా వరకు అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, దీన్ని జూదానికి మరో రూపమని అంటారు. దీపావళి సందర్భంగా గేంబ్లింగ్ లేదా జూదం ఆడడం మంగళకరమైన విషయంగా భావించబడుతుంది. ఇది ఫ్రెండ్లీ మోనికర్ కాబట్టి, ఈ అంశం కూడా దీపావళి పండుగ సందర్భాన్ని మంచి హాట్ ఫేవరేట్‌గా చేస్తుంది
తీన్ పత్తీ
తీన్ పత్తీ అనేది భారతీయ పోకర్ వెర్షన్. ఈ గేమ్‌లో మూడు కార్డులు ఉంటాయి కాబట్టి దీనికి తీన్ పత్తీ అనే పేరు వచ్చింది . దీన్నే ఫ్లష్ లేదా ఫ్లాష్ అని కూడా అంటారు.
పోకర్ మాదిరిగానే, తీన్ పత్తీ కూడా దీపావళి సందర్భానికి బాగా సరిపోయే ఆట. కార్డ్ గేమ్స్ విషయానికి వస్తే దీపావళి వేడుక సందర్భంగా ఆడడానికి ఈ గేమ్ అగ్ర స్థానంలో ఉంటుంది. కార్డ్ ఆర్డర్ ఆసు నుండి 2 వరకు ఉంటుంది (అంటే ఈ ఆర్డర్ పెద్ద కార్డు నుంచి చిన్న కార్డు వరకు వస్తుంది), ఈ గేమ్ 4 గురు ప్లేయర్స్ నుంచి మొదలుపెట్టి 7 మంది ప్లేయర్స్ వరకు ఆడుకోవచ్చు.
కార్డులు పంచే వ్యక్తి ఒక్కొక్కరికి సరిగ్గా 3 కార్డులు వచ్చేవరకు కార్డులు వేస్తాడు. ప్లేయర్స్ ఆ కార్డుల్ని చేతిలోకి తీసుకుని చూడవచ్చు లేదా ఆ కార్డుల్ని ఫేస్ డౌన్‌గా వేయించుకునే అవకాశం ఉంది. మొదటిది ప్లేయింగ్ సీన్ అంటే చూసి ఆడడమని అంటారు, రెండవ రకంగా ఆడడాన్ని ప్లేయింగ్ బ్లైండ్ అని అంటారు. ఒకవేళ ఎవరైనా ఫోల్డ్ చేయడాన్ని ఎంచుకుంటే, అతను గేమ్‌ని వదులుకుంటున్నాడని అర్థం, అంటే అతడు ఇకపై గెలవలేడు. మిగిలిన వారు తమ స్టేక్‌ని అంటే పందేన్ని ఎంచుకోవచ్చు.
ఈ గేమ్ కేవలం 2 ప్లేయర్స్ మాత్రమే మిగిలి ఉండే దాకా కొనసాగుతుంది, వీళ్లిద్దరిలో ఎవరు బాగా ఆడతారో వారు గెలుస్తారు. దీపావళికి ఆడుకోవడానికి ఇంకా చాలా కార్డ్ గేమ్స్‌ని ట్రై చేయవచ్చు, కానీ మేం ఈ నాలుగు క్లాసిక్ గేమ్స్‌లో ఒకదాన్ని ప్రయత్నించమని సిఫార్సు చేస్తున్నాము. దీపావళి సంవత్సరానికి ఒకసారే వస్తుంది.