మీ ఫోన్‌లో ఉండవలసిన  5 బెస్ట్ ఆప్స్‌

ఈనాటి వేగవంతమైన జీవితంలో ఆప్స్‌ ప్రముఖ అవసరంగా మారిపోయాయి, కానీ మన ఫోన్లు మన జీవితాల్లో ఎంతో టెక్నలాజికల్ ప్రమేయాన్ని కలిగి ఉంటాయి. అందుకే కేవలం ఫోన్‌లోనే మనకి సంబంధించిన, బాగా ఉపయోగకరమైన ఆప్స్‌ని మాత్రమే ఉంచుకోవడం, మిగతావాటిని తీసేయడం చాలా అవసరం.

 

కష్టంగా అనిపిస్తుంది కానీ నిజానికి కష్టమా అది? నిజానికి, మనం అన్ని ఆప్స్‌నీ రెగ్యులర్‌గా వాడం కదా. మనం కొన్ని ఆప్‌లు చాలా ముఖ్యమని అనిపిస్తాయి గానీ, నిజానికి మనకి అత్యుత్తమంగా పనికొచ్చే ఆప్స్‌ని  వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. అందువల్ల మీ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన బెస్ట్‌ 5 ఆప్స్‌కి సంబంధించిన మా లిస్ట్‌ని ఇక్కడ ఇస్తున్నాము. 

 

డిజిటల్ పేమెంట్‌ ఆప్స్‌

2017 లో ఆనాటి రాత్రి తర్వాత భారతదేశం పేమెంట్‌ అలవాట్లలో భారీ మార్పులు జరిగాయి. ఇకపై మనం బ్యాంకు నోట్స్‌ పెట్టుకున్న వ్యాలెట్‌ని  మోసుకుంటూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది.  మన మొబైల్ మనకు మన జేబులో ఉన్న బ్యాంకులాంటిదే. టెక్నలాజికల్ ఇన్నొవేషన్స్‌తో ఈ పేమెంట్‌ ఆప్స్‌ మునుపెన్నడూ లేనంత సురక్షితంగా ఉంటున్నాయి. అందువల్ల, పేటీఎం, ఫోన్ పే లేదా గూగుల్ పే, డిజిటల్ పేమెంట్‌ ఆప్స్‌ అనేవి ఇప్పుడూ ఎవ్వరూ కాదనలేని అవసరం. మీరు BHIM UPI ఆప్‌ లేదా మీ బ్యాంకు  స్వంత UPI ఆప్ ని కూడా ఉపయోగించవచ్చు, అయితే మీరు వీటిల్లో ఏ ఆప్‌ని ఎంచుకున్నా, అది ఉన్నత స్థాయికి చెందినదై ఉండేలాగానూ, చెలామణిలో ఉన్న ఆప్ అయి ఉండేలాగానూ చూసుకోండి. 

 

ఈ-కామర్స్ ఆప్‌

ప్రతిరోజూ సాయంత్రం ఇంటికెళ్లేటప్పుడు లోకల్ మార్కెట్ నుంచి కిరాణా సరుకులు కొనుగోలు చేయడానికీ, లేదంటే, ఇంటికి అవసరమైన మిగతా వస్తువులు, బట్టల్ని కొనడానికీ ప్రతి వారాంతంలోనూ కొన్ని గంటల సమయాన్ని వినియోగించే కాలం చెల్లిపోయింది. ఇవేళ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి కామర్స్ ఆప్స్ మీ ఫోన్ స్క్రీన్ టాప్ మీదకి వచ్చి ఒక సౌకర్యవంతమైన ప్రపంచాన్ని మీకు అందిస్తున్నాయి. కిరాణా సరుకులు కానివ్వండి, ఫ్యాషన్ లేదా టెక్నాలజీ, ఇలా ఏది కావాలన్నా కూడా ఎక్కడో దూరాభారాల్లో లేవు. డెలివరీ టైమ్‌లైన్స్ కూడా గణనీయంగా తగ్గాయి. కొన్ని ఫ్లాట్‌ఫారమ్స్‌లో అయితే అదే రోజున, ఇంకా మాట్లాడితే, రెండు గంటల్లోపు కంటే కూడా తక్కువ టైమ్‌లో  డెలివరీ చేయబడుతున్నాయి. 

 

మెసేజింగ్ – సోషల్ మీడియా ఆప్స్

రెగ్యులర్‌గా మన కుటుంబంతోనూ, స్నేహితులతోనూ కలిసి ఉండడం అనేది ఎంతో ముఖ్యమైన అంశం. ప్రపంచం రాన్రానూ చిన్నదవుతోంది. మనకు సంబంధించిన విషయాలతోనూ, మనుషులతోనూ కనెక్ట్ కావడానికి సహాయపడుతున్న టెక్నాలజీకి ధన్యవాదాలు. అలాగే ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారంల ద్వారా ప్రజలు అపరిచిత వ్యక్తులతో కనెక్ట్ అయ్యేందుకూ, స్నేహితులుగా చేసుకునేందుకూ, తమని తాము ఆహ్లాదకరంగా ఉంచుకోవడానికీ కూడా ఒక మార్గాన్ని అందిస్తున్నాయి. నిజానికి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లు తమ పవర్‌ని ఉపయోగించి, బ్రాండ్స్ తమ ఆడియన్స్‌ని చేరుకోవడానికి సహాయపడుతూ భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ ఉండడం వల్ల ఈ ఆప్‌ ఖచ్చితంగా మీ ఫోన్ లో ఉండాల్సిన అవసరం ఉంది.

 

వీడియో స్ట్రీమింగ్ ఆప్స్

గత కొన్నేళ్లలో జరిగిన మంచి విషయాల్లో ఒకటి డేటా ధరలు బాగా పడిపోవడం. పోకెట్‌ ఫ్రెండ్లీ డేటా ప్యాక్స్‌కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. మొబైల్‌లో హై క్వాలిటీ కంటెంట్‌ని చూడడం ఇక మీదట కలగా ఉండిపోదు. యూట్యూబ్‌, నెట్‌ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి వీడియో స్ట్రీమింగ్ ఆప్స్ ప్రజలకు వినోదాన్ని పంచే సరికొత్త ప్రపంచాన్ని తెరిచిపెట్టాయి. నిజానికి ఈ ఆప్స్ చాలా పాపులర్ కావడం వల్ల కేబుల్ టీవీ కంటే వీటినే చాలామంది ఇష్టపడుతున్నారు. ఈనాటి ప్రపంచంలో, మీకిష్టమైన షోస్, మూవీస్‌ డిమాండ్‌పై  చూడడం ఇక మీదట ఎంతమాత్రం లక్జరీ కాదు, అందుకే మీ ఫోన్‌లో వీటిలో కొన్ని ఆప్స్ ఖచ్చితంగా ఉండాలి.

 

గేమింగ్ ఆప్స్

ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏదైనా రియల్ గేమ్‌ని ఆడడంలో ఉన్న రియల్‌ థ్రిల్‌నీ, ఉత్తేజాన్నీ ఫీల్ అవాలనుకుంటే, ఆండ్రాయిడ్ iOS పరికరాల్లో గేమింగ్ ఆప్స్‌ అత్యుత్తమ పరిష్కారం. ఇందులో కేవలం పిల్లలు మాత్రమే కాక పెద్దవారు కూడా ఎంచుకోవడానికి అనేక రకాల ఆప్స్ ఉన్నాయి. రమ్మీకల్చర్‌ ఆప్‌ 24×7 ప్రజలకి అంతరాయం లేని ఆన్‌లైన్‌ రమ్మీ అనుభవాన్ని అందిస్తుంది. దీన్ని  క్యాష్‌ కోసమూ, గెలవడం కోసమూ కూడా ఆడవచ్చు. వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ రోజే మీరు ఈ ఆప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనీ, మీకు మీరుగా ఆనందం పొందాలనీ  మేం బలంగా సిఫార్సు చేస్తున్నాం. 

 

మీ ఫోన్ లో కూడా ఈ ఆప్స్‌లో కొన్ని అయినా ఉన్నాయా? ఈ లిస్ట్‌లో  మేం మరిన్ని ఆప్స్‌ చేర్చాల్సి ఉందేమో తెలియజేయండి.