ప్రతి రమ్మీ కార్డు లవర్ చూడాల్సిన 5 సినిమాలు
రమ్మీ కార్డు గేమ్ దాదాపు 500 సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉంది. అప్పటి నుంచీ ఆడబడుతున్న ఈ రమ్మీ కార్డ్ ప్లే ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఆడుకోవచ్చు. టెక్నాలజీ ఇంత స్థాయికి అభివృద్ధి చెందినందుకు ధన్యవాదాలు. ఈ గేమ్ ఆడుతుంటే హాయిగా కాలక్షేపం అవుతుంది, అలాగే ఇది చక్కగా అందరితో కలిసి కూర్చుని ఆడుకోగల గేమ్ కూడా. భారతదేశంలో, రమ్మీ 13 కార్డు గేమ్ అత్యంత ప్రజాదరణ పొందింది, రమ్మీ సుప్రీం కోర్టు ద్వారా ఒక ‘నైపుణ్య-ఆధారిత’ గేమ్ గా వర్గీకరించబడింది, అలాగే డబ్బు సంపాదించడానికి ఇది ఒక సంపూర్ణ చట్టపరమైన అవెన్యూగా ఉంది.
కార్డు గేమ్ రమ్మీ నియమాలు బాగా తెలుసుకుని, ఎంత ఎక్కువగా ఆడుతుంటే రియల్ మనీ కూడా అంత బాగా గెలుచుకోవచ్చు. కార్డ్ గేమ్స్ కాకుండా భారతీయులకి మరో గొప్ప కాలక్షేపమూ, అభిరుచీ సినిమాలే. భారతీయులకి సినిమాలు చూడడం ఇష్టం. బాలీవుడ్ సినిమాలైనా, హాలీవుడ్, ఇంకా ఇతర సినీ పరిశ్రమలకి చెందిన సినిమాలైనా, వారు చూస్తారు, మంచి సినిమాను బాగా ప్రశంసిస్తారు. కార్డ్ గేమ్స్‌కి సంబంధించిన సినిమాల అభిమానుల కోసమైతే మేము మీరు మిస్ కాకూడని సినిమాలు, తప్పకుండా చూడవలసిన సినిమాల పెద్ద జాబితా ఉంది!
ఒక రమ్మీ లవర్ కోసం తప్పక చూడవలసిన 5 సినిమాలు
ప్రతి రమ్మీ కార్డు ప్లేయర్, లేదా ఒక కార్డ్ గేమ్ లవర్, ఖచ్చితంగా కనీసం ఒకసారైనా చూడాల్సిన సినిమాల జాబితా ఇక్కడ ఇస్తున్నాము.
కేసినో రాయల్
ఈ బ్లాక్ బస్టర్ హిట్ గురించి మాట్లాడకుండా కార్డ్ గేమ్ మూవీస్ గురించి ప్రస్తావించలేం. జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో భాగమైన ఈ మూవీ 2006 లో విడుదలైంది. వరుసబెట్టి జరిగే కొన్ని సంఘటనలతో, హీరో 007 తాను హై స్టేక్స్ పోకర్ గేమ్ ఆడి తీరాల్సిన దురదృష్టకరమైన పరిస్థితిలో ఉన్నట్టు తెలుసుకుంటాడు. ఇందులో నడిచే గొప్ప ఉత్కంఠకి గురి చేసే సన్నివేశాలకి ఏ కార్డు గేమ్ లవర్ కూడా థ్రిల్ అవకుండా ఉండలేడు.
గేంబ్లర్
1971 లో ఈ మూవీ విడుదలైనప్పుడు, పాటలు బ్రహ్మాండంగా హిట్ అయ్యాయి. హీరో రాజా పాత్ర పోషించిన దేవానంద్ చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకుంటాడు. ఇతని చుట్టూనే ఈ ప్లాట్ తిరుగుతుంది. అతను ఆ తర్వాత ఒక క్రిమినల్ ‘మాస్టర్’ సంరక్షణలో పెరుగుతుంటాడు. అతను అక్కడ పేకాట గురించిన ప్రతి చిన్న విషయమూ తెలుసుకుంటాడు. త్వరలోనే తన మీద తనకి గురి కుదిరి, ‘మాస్టర్’ ని విడిచి పెట్టి వెళ్తాడు. ఇక్కడ నుంచి రాజా జీవిత గమనంలో మలుపులు తిప్పే అనేక సంఘటనలు ఈ సినిమాని ఒక కళాఖండంగా మార్చేశాయి.
తీన్ పత్తీ
ఇందులో అమితాబ్ బచ్చన్ అనేక మార్గాల్లో విఫలమైన ఒక గణిత శాస్త్రవేత్తగా నటించాడు. వ్యావహారిక స్వభావం లేని అతని గణిత సిద్ధాంతమే దానికి కారణంగా భావించబడుతుంది. అందుకు నిరుత్సాహపడకుండా, అతడు తన సిద్ధాంతాలను సందర్భోచితంగా మలచుకునే మార్గాల కోసం వెతుకుతుంటాడు. తర్వాత అతడు తీన్ పత్తీ గేమ్ ఫలితాల్ని అంచనా వేయడానికి ప్రోబబిలిటీపై తన డిజర్టేషన్ కోసం పనిచేసి, దానిని విజయవంతంగా సాధిస్తాడు. ఈ మూవీ 2010 లో విడుదలైంది. మీకు తీన్ పత్తీ నచ్చిందా, అయితే ఖచ్చితంగా ఇది మీరు చూడాల్సిన సినిమాయే.
మీరు దీని గురించి కూడా చదవాలని అనుకుంటారు:-ప్రయాణం చేస్తున్నప్పుడు ఆడుకునే కార్డ్ గేమ్
21
ఇది ఒక 2008 అమెరికన్ హీస్ట్ డ్రామా, MIT బ్లాక్ జాక్ టీమ్ వాస్తవ గాథ ప్రేరణగా వచ్చిన సినిమా. ఇది బెన్ మెజ్రిచ్ రాసిన బెస్ట్ సెల్లింగ్ బుక్ బ్రింగ్ డౌన్ ది హౌస్ ఆధారంగా తీశారు. $300,000 హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఫీజును చెల్లించడానికి ఇబ్బంది పడే ఒక MIT గణిత మేజర్, బెన్ క్యాంప్‌బెల్ కథ ఇందులో చెప్పబడింది. కెవిన్ స్పేసీ ప్లే చేసిన ప్రొఫెసర్ మైకా రోసా, తన ఈక్వేషన్‌తో ఈ సమస్యను సాధిస్తాడు. ఆరుగురు MIT విద్యార్థుల టీమ్ పేకాట గేమ్‌లో ప్రొఫెషనల్స్‌గా మారడానికి శిక్షణ పొందుతారు, లాస్ వెగాస్ కాసినోల్లో ఆడడానికి వెళ్లి మిలియన్ల కొద్దీ అమౌంట్‌ని గెలుచుకుంటారు.
రౌండర్స్
హై-స్టేక్స్ పోకర్ ప్రపంచంలో తెర వెనుక ఏం జరుగుతోందో తెలియజేస్తుంది ఈ 1998 నాటి అమెరికన్ డ్రామా. ఇందులో ఎడ్వర్డ్ నార్టన్, మాట్ డామన్ నటించారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఇద్దరు స్నేహితులకి సంబంధించిన కథ ఇది. వాళ్లు ఒక పోకర్ని గెలుచుకోవడం ద్వారా సమస్య నుంచి బయటకు రావాలని అనుకుంటారు. ‘రౌండర్’ అనే పదానికి, పెద్ద పెద్ద పందేలతో పోకర్ గేమ్స్ ఆడే చోట్ల కోసం నగరమంతటా వెతుక్కుంటూ తిరిగే వ్యక్తి అని అర్థం.
మీరు రమ్మీ వంటి కార్డ్ గేమ్స్‌ని ఇష్టపడుతుంటే,13 కార్డ్ గేమ్, ఇంకా ఎన్నో రకాల ఆటలు ఆడేందుకు రమ్మీకల్చర్‌లో జాయిన్ అవండి. మేము ఆకర్షణీయమైన రమ్మీ బోనస్‌లు, కస్టమైజబుల్ టేబుల్స్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్లేయర్స్ యాక్టివ్ నెట్వర్క్ని అందిస్తాం. నేడే మా రమ్మీ గేమింగ్ ఆప్ పొందండి!