కేరళ వరద బాధితులకు సహాయం చేసేందుకు చేతులు కలపండి

కేరళ వరదలు: దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రం కేరళ. పేరెన్నిక గన్న బీచ్‌లు, ముచ్చట గొలిపే బ్యాక్‌వాటర్స్, మరియు సహజమైన పచ్చని ప్రకృతి దృశ్యాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న రాష్ట్రం కేరళ. సుందరమైన మడుగులు, నదులు, మరియు కాలువలను దేవుడిచ్చిన బహుమతిగా పొందిన భువిపై ఉన్న స్వర్గంగా ఈ రాష్ట్రాన్ని పరిగణిస్తారు.

 

ఈ సుందరమైన రాష్ట్రం ఇప్పుడు 100 సంవత్సరాలలో అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తును ఎదుర్కుంటోంది. అత్యధిక వర్షపాతం, కొండచరియలు విరిగిపడడం, మరియు అకాల వరదలు ఈ రాష్ట్రంలోని నివాస ప్రాంతాలు, రోడ్లు, వంతెనలు, మరియు పంట పొలాలను నాశనం చేశాయి.

300 మందికి పైగా ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు మరియు 5 లక్షలకు పైగా ప్రజలు తమ నివాసాలను కోల్పోయి సుదూరంగా తరలిపోవాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడండి | రమ్మీకల్చర్‌లో రాఖీ పండుగ చేసుకోండి

Donate for Kerala Flood

కేరళ వరద బాధితులకు సహాయం చేయడంలో చేతులు కలపండి:

వరద ప్రభావంతో జీవితాలను కోల్పోయిన వారు, తమ జీవితాలను పునర్నిర్మించుకోవడం కోసం ఇది సహాయం చేయడంలో ఒక ప్రయత్నం. ఈ ప్రజలకు నివాసం, నీరు, ఆహారం, ఔషధాలు, దుస్తులు, విద్యుత్, మరియు ఇంధనం అందుబాటులో లేవు. ఈ వ్యక్తులు తమ కుటుంబాలు, ఇళ్లు, మరియు జీవనాలను కోల్పోయారు. వారు తమ ప్రియమైనవారిని వెతుక్కుంటున్నారు మరియు తమ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు.

ఇది కూడా చదవండి: ఆడండి చాలు. సరదా చేయండి. రమ్మీ గేమ్ 2018ను ఆస్వాదించండి

కేరళోల ఎందరో మనుష్యుల ప్రాణాలు, ఆస్తులు, జీవరాశి, వ్యాపారాలు, మరియు పంటలకు భారీ నష్టం వాటిల్లింది. తమన యూజర్‌లను సామాజిక దృక్పథంతో వీరికి సహాయం చేయాల్సిందిగా రమ్మీకల్చర్ అభ్యర్ధిస్తోంది.

జీవితం యొక్క ఉద్దేశ్యం ఇతరులకు సహాయం చేయడమే

దక్షిణాది రాష్ట్రం కేరళలో వరదల బారిన ప్రజలకు సహాయం చేసేందుకు దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన భారతీయులు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. సెర్చ్, రెస్క్యూ, మరియు ఆహార సరఫరా వంటివి చేసేందుకు మరియు సహాయం అవసరమైన వారిని చేరుకునేందుకు అనేక మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను ఉపయోగించుకుంటున్నారు.

కేరళలోని ప్రజలకు మీరు ఎలా విరాళం ఇవ్వాలి మరియు సహాయపడగలరనే అంశాలు ఇక్కడ ఉన్నాయి:

రాష్ట్రంలోని పరిస్థితి మరింతగా దిగజారుతోందని, సహాయం చేయాల్సిందిగా దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన ప్రజలను కేరళ ముఖ్యమంత్రి పినరపి విజయన్ అభ్యర్ధించారు. “వారి జీవితాలను కాపాడడమే మా ప్రాధాన్యత. ఇప్పుడు పునర్నిర్మించుకోవడంలో వారికి సహాయం చేయడం మన బాధ్యత” అని ఆయన ట్వీట్ చేశారు.

  1. మీరు వారి వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీ విరాళాలు అందించవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి…

  1. ఈ కింది ఖాతాకు డబ్బు పంపించడం ద్వారా కూడా మీరు విరాళం అందించవచ్చు.

ఖాతా సంఖ్య: 67319948232

బ్యాంక్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

శాఖ: సిటీ బ్రాంచ్, తిరువనంతపురం

ఐఎఫ్‌ఎస్‌ కోడ్: SBIN0070028

పాన్ సంఖ్య: AAAGD0584M

Leave a Reply