ఆన్‌లైన్ రమ్మీ యొక్క చట్టబద్ధత

Legality of Online Rummy

రమ్మీ పై సుప్రీంకోర్టు తాజగా ఇఇచ్చిన తీర్పు: నైపుణ్యాలు మరియు అవకాశాలు, లేక రెండూ ఉన్న ఆటా?

నైపుణ్యం అవసరమైన గేమ్ రమ్మీ. గొప్ప ప్లేయర్‌లు, గేమ్‌లో గెలవడం కోసం సరైన సీక్వెన్స్‌లు మరియు సెట్‌లను మొదట సిద్ధం చేస్తారు. రమ్మీని భారతదేశంలో ఎక్కువగా సరదాగా ఆడినా, అంచనా వేయలేనంత కాలం ముందు నుంచే ఈ కార్డ్ గేమ్‌ ద్వారా విజేతలకు క్యాష్ మరియు రివార్డ్‌లను అందిస్తున్నారు. ఇండియాలో ప్రధానంగా జూదంపై చట్టాలను రాష్ట్రాలను నిర్దేశిస్తాయి. సులభంగా చెప్పాలంటే, అవకాశం కంటే కూడా ఈ గేమ్‌ను నైపుణ్యం ఆధారంగా ఉండడంతో రమ్మీ గేమ్ జూదంగా పరిగణించడం జరగదు; అయితే, సుప్రీంకోర్టు మరియు హై కోర్టు ఇచ్చిన వివిధ తీర్పుల కారణంగా రమ్మీ ప్రపంచం, అటూ ఇటూ కదిలిపోతూ ఉంది.

రమ్మీ పై సుప్రీంకోర్టు తాజా తీర్పు:

అంతకు మంచి, రమ్మీ ఆడడం అనే అంశం గురించి భారతీయ సుప్రీం కోర్టు తాజా రెండు ప్రధాన తీర్పులను ఇచ్చింది. టు-బెంచ్ మరియు త్రీ-బెంచ్ జడ్ విభాగాలు ఇచ్చిన ఈ తీర్పుల ప్రకారం, రమ్మీని నైపుణ్యాల యొక్క గేమ్‌గా నిర్ధారించారు. 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కె. సత్యనారాయణ మరియు ఇతరుల మధ్య నడిచిన కేసు విషయానికి వస్తే, 22 నవబర్, 1967న ఇద్దరు జడ్జీల బెంచ్ రమ్మీ గేమ్‌ను పూర్తిగా అవకాశం ఆధారిత గేమ్ కాదని, ఫ్లష్ లేదా బ్రాగ్ మాదిరిగా ఇది అవకాశంపై ఆధారపడి ఉండదని చెప్పారు. చేతిలో ఉన్న కార్డులు మరియు డిస్కార్డ్ చేసిన కార్డులను గుర్తు పెట్టుకోవాల్సి ఉండడంతో రమ్మీ గేమ్‌కు మంచి జ్ఞాపక శక్తి అవకాశం అవసరం.

డా. కె. ఆర్ లక్ష్మణ్ వర్సెస్ తమిళనాడు రాష్ట్రం మరియు ఎఎన్ఆర్ మధ్య నడిచిన మరొక కేసు, 12 జనవరి 1996కు దారి తీస్తుంది. ఈ కేసులో, “ప్రధానంగా మరియు అత్యధికంగా ఇది నైపుణ్యం యొక్క ఆట” అని న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు మరియు అందుకే ఇది వివిధ రాష్ట్ర జూద చట్టాలకు వెలువలకు చేరుకుంటుంది.

2015లో, మదన్ బి లోకూర్ మరియు ఎస్ ఏ బాబ్‌డే అనే ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఆన్‌లైన్ రమ్మీ మరియు ఇతర కార్డ్‌ గేమ్‌లు కూడా వాటి చట్టబద్ధత విషయంలో ఏ కోర్టు ఆదేశాలకు సంబంధించిన అంశం కాదని మరియు ఏ అంశాలకు సంబంధించనిదని చెప్పారు, అందుకే ఆన్‌లైన్ రమ్మీ వెబ్‌సైట్‌లపై దాఖలు చేసిన సవాళ్లు ప్రీ-మెచ్యూర్‌గా నిలిచిపోయాయి.

అయితే, గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని కొన్ని వివిధ రాష్ట్రాలలో రమ్మీ గేమ్‌ను పందెం కాసి ఆడడంపై కొన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. పైన చెప్పిన దృక్పథం ప్రకారం, మరియు భారతదేశంలో ఆన్‌లైన్ రమ్మీ వెబ్‌సైట్‌లలో రమ్మీని నిషేధించడంపై, రాబోయే ఏడాదిలో సుప్రీం కోర్టు తీర్పు వచ్చే అవకాశం ది. కొన్ని కీలక తీర్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రమ్మీపై తాజాగా కేరళ హై కోర్టు తీర్పు:

2019 జనవరి ప్రారంభంలో, కేరళ హై కోర్టు తీర్పు ఏం చెప్పిందంటే, రమ్మీ గేమ్ నైపుణ్యాలకు సంబంధించిన ఆట అని ఒప్పుకుంది, అతే రమ్మీని పందెం కాసి ఆడడం మాత్రం కేరళ గేమింగ్ యాక్ట్, 1960 ప్రకారం దీనిని ఉల్లంఘించడం నేరం అని తెలిపింది. అయితే, కేరళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క 1976 నోటిఫికేషన్‌కు ఇది వైరుధ్యంగా ఉంది. కేరళ గేమింగ్ యాక్ట్, 1960 సెక్షన్ 14ఏ; ఇందులో రమ్మీకి మినహాయింపు ఇచ్చారు; కార్డ్ గేమ్‌లు – 28/56/112; కప్ మరియు కాయిన్, డార్ట్ త్రో, బాల్ త్రో, మరియు షూటింగ్ పోటీలను మినహాయింపు ఇచ్చారు. ఈ ఆరు గేమ్‌లు స్కిల్ ఆధారితం అని రాష్ట్ర ప్రభుత్వం ఆ సమయంలో అంగీకరించింది. కేరళ గేమింగ్ చట్టం సైడ్-బెట్టింగ్ చేయడాన్ని నిరోధించింది మరియు కానీ అది పందెంతో ఆడడం అయినా సరే ఇది ఆన్‌లైన్ రమ్మీ విషయంలో కాదు.

భారతదేశంలోని కొన్ని ఆన్‌లైన్ రమ్మీ ప్లాట్‌ఫాంలు 2019 జనవరిలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేశాయి, అయితే, వీటి విచారణ తిరస్కరణకు గురయింది.

రమ్మీ పై తెలంగాణ హై కోర్టు తాజా తీర్పు:

2017 జూన్‌లో, రాష్ట్రంలో ఆన్‌లైన్ రమ్మీ మరియు పోకర్‌లను నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. ఈ ఆర్డినెన్స్‌లో, రమ్మీ గేమ్ అంటే అవకాశం ఆధారిత ఆట అని ప్రభుత్వం తెలిపింది, మరియు నైపుణ్యాల ఆధారంగా ఆడే ఆటగా పరిగణించరాదని తెలిపింది. ఈ ఆర్డినెన్స్ 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కె. సత్యనారాయణ మధ్య నడిచిన కేసులో రమ్మీ నైపుణ్య ఆధారిత గేమ్ అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఉంది. రమ్మీని నైపుణ్య ఆధారిత గేమ్‌గా పరిగణించాలంటూ హై కోర్టులో ఈ ఆర్డినెన్స్‌ను సవాలు చేసారు. అయితే, నైపుణ్యాల ఆధారిత గేమ్ అనే క్లాజ్‌ను తొలగిస్తూ, మరో ఆర్డినెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.

ప్రస్తుతం, తెలంగాణ రాష్ట్రంలో రమ్మీని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లలో పందెం కోసం ఆడడం నిషేధించబడింది, అయితే ఉచిత గేమ్‌లను ఏ సమయంలోనా ఏ రోజైనా ఆడుకుని ఆస్వాదించవచ్చు.

నైపుణ్యాల యొక్క గేమ్ అంటే ఏమిటి?

నైపుణ్యం యొక్క గేమ్‌గా పరిగణించడాన్ని అర్ధం చేసుకోవడం అంటే, గుర్రపు పందేల గురించి చెప్పుకోవడంతో ప్రారంభిద్దాం. ఇందులో భారీగా పందేలు ఉంటాయి, అయినా అది చట్టబద్ధమే, ఎందుంకటే ఈ గేమ్‌లో గెలుపు లేదా ఓటమి అనేది పూర్తి గుర్రం మరియు దాని యొక్క జాకీ యొక్క నైపణ్యం పైనే ఆధారపడి ఉంటుంది. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, గుర్రపు పోటీలలో పందేలు కాయం పూర్తిగా అదృష్టం పైనే ఆధారపడి ఉండదు, అంతే కాదు ఇది పూర్తిగా నైపుణ్యం ఆధారంగానే గెలుపు ఆధారపడి ఉంటుంది. 1888 పోలీస్ చట్టం లేదా గేమింగ్ యాక్ట్ 1930 ప్రకారం ఇది చట్టవ్యతిరేకమైన జూదం కాదని ఈ తీర్పు వెల్లడించింది.

రమ్మీ గేమ్ నైపుణ్యాలదా లేక అదృష్టానిదా?

రమ్మీ అంటే నైపుణ్యాల గేమ్. కార్డులను వేసే సమయంలో కొంత అదృష్టం కూడా మిళితం అయి ఉంటుంది, కానీ గెలుపు అనేది మాత్రం ఎక్కువగా ప్లేయర్‌ తన చేతిలో ఉన్న కార్డులను ఎలా నిర్వహిస్తారనే నైపుణ్యాల పైనే ఆధారపడి ఉంటుంది. మీరు డీల్ చేసే కార్డులతోనే మీరు ఆడతారు! “మీరు పంచే కార్డులను మీరు నియంత్రించలేరు, కానీ మీరు హ్యాండ్‌ను ఎలా ఆడతారన్నదే మీ చేతిలో ఉంటుంది.” అని డా. రాండీ పాశ్చ్ అన్నారు. ఈ కొటేషన్ రమ్మీ గేమ్‌ను చాలా సంక్షిప్తంగా వివరిస్తుంది.