ఆన్లైన్ రమ్మీలో ప్లేయర్స్ ఎందుకు ఓడిపోతుంటారు
ఒక రమ్మీ ప్లేయర్ మనస్సులో నేను ఆన్లైన్ రమ్మీ గేమ్‌ని ఎందుకు గెలవలేకపోతున్నాను అనే ప్రశ్న సర్వసాధారణంగా మెదులుతుంది.
మామూలుగా వాళ్లు కార్డ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు, మనం ఆడేవాళ్ల ఉత్సాహాన్ని చూస్తుంటాము. వాళ్లు గేమ్ రౌండ్లో గెలిచినప్పుడు వాళ్ల ఉత్సాహం రెట్టింపవుతుంది. కానీ, ప్రతి గేమ్ చివరా, ఒక ప్లేయర్ గెలుస్తాడు, ఇతరులు ఓడిపోతారు.
వాస్తవానికి ఆన్లైన్లో ఆడుతున్నప్పుడు, ఆ 13 కార్డుల్నీ అవసరమైన సీక్వెన్సుల్లో సెట్ చేయడానికి మీకు మీ నైపుణ్యాలతో బాటు కొంచెం అదృష్టం కూడా అవసరం. బాగా ప్రొఫెషనల్‌గా ఆడే ప్లేయర్స్ కూడా తమ తప్పుల నుంచే నేర్చుకుంటారు. ఇంకా ఇంకా ఆడుతూ తమ వ్యూహాలను మెరుగుపరుచుకుంటారు, కాని చాలా మంది ఇతర ప్లేయర్స్ ఈ విషయాల్ని పట్టించుకోరు, వాటి దుష్పరిమాణామాల్ని ఎదుర్కొంటారు.
ఆన్లైన్ రమ్మీలో మీరు ఓడిపోవడానికి 4 కారణాల్ని పరిశీలిద్దాం: –
మంచి స్కిల్‌ఫుల్ స్ట్రేటజీతో ఆడలేకపోవడం: రమ్మీ నైపుణ్యంతో ఆడాల్సిన గేమ్. ఈ గేమ్‌లో విజేతగా నిలవడానికి, కార్డును చాలా త్వరగా తీసుకోవడం, పడేయడం చేస్తుండాలి, అవసరమైన వాలిడ్ సెట్స్‌లో ఆ 13 కార్డుల్నీ సెట్ చేయగలగాలి. నాన్-ప్యూర్ సెట్‌ని క్రియేట్ చేయడానికి జోకర్నీ, కట్ జోకర్నీ తెలివిగా ఉపయోగించాలి. కనీస స్కోర్‌ని మెయింటెయిన్ చేయడానికి హై వేల్యూ కార్డ్స్‌ని పడేయడానికి ప్రయత్నించండి.
ఏకాగ్రదృష్టి లేకుండా ఆడడం: మంచి ఫోకస్, ఏకాగ్ర దృష్టి లేకుండా మీరు ఆడే ఏ గేమ్లోనైనా ఓడిపోతారని మీరు భయపడాల్సి ఉంటుంది. రమ్మీ మంచి నైపుణ్యంతో ఆడాల్సిన గేమ్, అందువల్ల మీరు ఏ కార్డు ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుని ఉపయోగించాలి. ఎప్పుడైనా మీకు ఆలోచించి ఆడేంత సమయం ఉంటేనే మీ విశ్రాంతి సమయంలో రమ్మీ ఆడండి.
గేమ్‌ని ఎప్పుడు విడిచిపెట్టాలో తెలియకపోవడం: కార్డుని చూసిన వెంటనే, మీరు కార్డుని విశ్లేషించాలి, గేమ్ గెల్చుకునే అవకాశాల్ని అంచనా వేసి అది గెలిచే ఆటేనా లేక ఓడిపోయేలా ఉందా అని చూసుకోండి. మీ కార్డ్స్ మీకు అఉకూలంగా పడకపోతే, వెంటనే గేమ్ నుంచి బయటకి రండి. కొత్త ప్లేయర్స్ తరచుగా గేమ్స్‌ని పూర్తిగా ఆడేస్తారు, అందువల్ల వాళ్లకి ఎక్కువ పెనాల్టీ పడుతుంది.
భావావేశాల్ని వదిలిపెట్టలేకపోవడం: రమ్మీ ఆడే ప్రతి ప్రొఫెషనల్ ప్లేయర్ ఒక విషయమైతే ఖచ్చితంగా చెప్తారు. అదేమిటంటే, “మన భావాల్ని బయటికి వ్యక్తం చేయకండా ఉంటేనే మనకి మేలు జరుగుతుంది”. మీరు గేమ్‌ని గెలవవచ్చు, ఓడిపోవచ్చు. మీరు ఎమోషనల్‌గా వాటితో అటాచ్ అయితే, మీరు చెడు నిర్ణయం తీసుకుంటారు. మీరు కొన్ని గేమ్స్ కోల్పోయినట్లయితే, అప్పుడు బ్రేక్ తీసుకోండి, మళ్లీ కొత్త మైండ్‌సెట్‌తో ప్రారంభించండి.