ఆన్లైన్ రమ్మీలో బాగా ఆడడానికి ప్లేయర్స్‌కి ఉండాల్సిన లక్షణాలు

రమ్మీ కేవలం అదృష్టం కాకుండా, మంచి నైపుణ్యం కూడా ఖచ్చితంగా అవసరమయ్యే గేమ్!
గేమ్‌కి అవసరమైన నైపుణ్యాల్ని సమీకరించడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ వాటికి మంచి ప్రాక్టీస్ కూడా ఉండాలి, ఆ ప్రాక్టీస్ నిజమైన గేమ్ ఆడితే మాత్రమే వస్తుంది. సాధన కంటే గొప్పదేమీ లేదు, ఉందంటారా?
మంచి ప్లేయర్‌గా ఎదగడానికి కొన్ని వ్యక్తిత్వ లక్షణాలు ఇంకా అవసరం. ఈ ప్రాథమిక లక్షణాలు ఆన్లైన్ రమ్మీ నైపుణ్యాలను సంపాదించడానికి ఒక మెట్టు, ఆన్లైన్ రమ్మీ మినహాయింపు కాదు.
కాబట్టి, మీరు గొప్ప ఆన్లైన్ రమ్మీ ప్లేయర్‌గా ఎదగడానికి సహాయపడే లక్షణాలు మీకు ఉన్నాయో లేదో పరిశీలించుకోండి. వాటిని గుర్తించడంలో మీకు సహాయపడడానికి మేము మీకు కొన్ని ఆన్లైన్ రమ్మీ చిట్కాల్ని అందిస్తున్నాము.
ఆత్మవిశ్వాసం
మీరు ఎంతవరకు ఫైట్‌ని మెయింటెయిన్ చేయబోతున్నారో నిర్ణయించడంలో మీ ఆత్మవిశ్వాసం ఒక కీలకమైన అంశం. గేమ్‌లో ప్రారంభంలో తగిలే ఎదురుదెబ్బలకి మనం ఓడిపోతున్నామేమో అని అనిపించకూడదు. రమ్మీలో హెచ్చు తగ్గులు జరుగుతూనే ఉంటాయి. లక్ ఫ్యాక్టర్ వల్ల ప్లాన్ ప్రకారం అన్ని పనులూ ఎల్లప్పుడూ జరగకపోవచ్చు. కానీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం వల్ల ప్రతి అవకాశాన్నీ పూర్తిగా వినియోగించుకోవడం జరుగుతుంది.
కాలిక్యులేటివ్‌గా ఉండడం
ఒకే ఒక్క మూవ్ మీ గేమ్‌ని గెలిచేలాగానూ చేయగలదు లేదా పాడుచేసేయనూగలదు. కాబట్టి, కాలిక్యులేటివ్‌గా ఉండడం చాలా ముఖ్యమైన అంశం. మీ దగ్గర ఏ కార్డులు ఉన్నాయో చూసుకోండి, వాటితో ఏ సెట్స్ చేయవచ్చో చూసుకోండి. అంచనా వేసుకుని, ఫలితాల ఆధారంగా ఏం చేస్తే ఏమవుతుందో పలు దృశ్యాల్ని ఊహించుకోండి, మీ గెలుపు అవకాశాలను పెంచుకోవడానికి ప్రయత్నించండి.
ఏకాగ్రదృష్టి కలిగి ఉండడం
మీరు త్వరగా పరధ్యానంలోకి జారిపోనివారైతే, నేపథ్యంలో వినిపించే శబ్దాల్ని పట్టించుకోకుండా ఉండవచ్చు, చేస్తున్న పని మీద ఎలా దృష్టి పెట్టాలో తెలుసుకోగలిగితే, మీరు బహుశా ఆన్లైన్ రమ్మీలో అద్భుతంగా ఆడవచ్చు.
అబ్జర్వ్ చేయడం
మీతో ఆడే చాలా మంది ప్లేయర్స్ కొన్ని క్షణాల వ్యవధిలో ఎన్నో మూవ్స్ వేస్తుంటారు. ప్రతి మూవ్నీ నిజంగా ఆసక్తిగా గమనించగలిగితే ఆన్లైన్ రమ్మీ గేమ్‌లో ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
ఆలోచనతో ఆడడం
మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా, విమర్శనాత్మకమైన ఆలోచన కలిగి ఉండడం, వ్యూహాత్మకంగా ఆడడం అనే లక్షణాలు ఆన్లైన్ రమ్మీలో బాగా రాణించడానికి అవసరమైన కీలకమైన నైపుణ్యాలు. మీరు మీ మనసులో ప్రత్యర్థి మూవ్స్‌ని ఊహించగలిగితే, మీరు సక్సెస్ఫుల్ ప్లేయర్‌గా ఎదగగలుగుతారు.
ప్రాక్టికల్‌గా ఉండడం
ఏదైనా సరే, ఫేస్ చేయాలి. మీరు ఎంత గొప్ప ఆటగాడైనా, మీరు ఇంతకుముందు గేమ్స్‌లో ఎంత బాగా ఆడినా, మీరు ఆన్లైన్ రమ్మీలో ప్రతి గేమ్‌లోనూ గెలవలేరు. ప్రతి గేమ్‌కీ కొత్త కొత్త వాళ్లు వచ్చి ఆడుతుంటారు, ఆ రకంగా ఎప్పటికప్పుడు వేర్వేరు ప్రత్యర్థులతో ఆడవలసి ఉంటుంది. ఈ కారణాల వల్ల ఎవరైనా ప్రతిసారీ గెలవడం దాదాపు అసాధ్యం. ఈ పరిస్థితుల్లో భావోద్వేగాలకి లోను కాకుండా, ప్రాక్టికల్ ఔట్‌లుక్‌తో ఉండడం చాలా ముఖ్యం. మీరు కొన్ని ఆటలు గెలుస్తారు, కొన్ని ఆటలు ఓడిపోతారు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకుంటే పాజిటివ్ విన్నింగ్ రేట్‌ని మెయింటెయిన్ చేయగలుగుతారు. రమ్మీకల్చర్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై క్యాష్ కోసం ఆన్లైన్ రమ్మీని ఆడడం మొదలుపెట్టినపుడు ఈ వైఖరి నిజమైన గేమ్ ఛేంజర్‌కి ఉండవలసిన వైఖరి అని నిరూపించబడుతుంది.
కాబట్టి, ఆన్లైన్ రమ్మీ ప్లేయర్స్‌కి ఉండాల్సిన ముఖ్యమైన వ్యక్తిత్వ లక్షణాల్లో మేము గమనించిన కొన్ని ఇక్కడ ఇచ్చాము. మీకు ఈ లక్షణాలు ఉంటే, ఆన్లైన్ రమ్మీ ప్లేయర్స్ క్లబ్‌కి స్వాగతం.