రమ్మీలో వివిధ రకాలు

క్లాసిక్ రమ్మీ గేమ్ సుమారు రెండు వందల సంవత్సరాలుగా ఉన్నప్పటికీ, రమ్మీ నుండి ఆవిర్భవించి ఎన్నో ఏళ్లుగా ప్రాచుర్యం పొందిన రకాలు చాలా ఉన్నాయి.
అన్ని రకాల రమ్మీలోనూ తప్పనిసరిగా ఉన్న ఒక కోణం సర్వసాధారణమైనది. ఈ రకాలన్నీ కూడా ఒకే సూట్‌కి చెందిన వరుస కార్డుల్ని సీక్వెన్సులో మెల్డ్ చేయడం గానీ లేదా వివిధ సూట్లలో ఒకే ర్యాంక్‌కి చెందిన కార్డుల మెల్డింగ్కి సంబంధించినవి గానీ అయి ఉంటాయి. వీటన్నింటిలోనూ కామన్‌గా ఉన్న మరో అంశమేమిటంటే, ఈ రకాలన్నీ కార్డుల్ని సెలెక్ట్ చేసుకోవడం, పడేయడానికి సంబంధించినవి. రమ్మీకి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన ప్రసిద్ధ రకాల్ని కనుగొనండి.
ఇండియన్ రమ్మీలో 13 కార్డుల రమ్మీ
రమ్మీ 500కి సంబంధించిన జిన్ రమ్మీ ఎక్స్‌టెన్షన్‌గా పరిగణించబడుతున్న ఈ గేమ్‌ని 2-6 ప్లేయర్స్ ఆడతారు. వీళ్లు 13 కార్డులతో ఈ ఆటని ఆడతారు. కార్డుల్ని ఎంచుకోవడం లేదా పడేయడం చేస్తూ ప్లేయర్స్ కార్డుల్ని సీక్వెన్స్లుగానూ లేదా సెట్లుగానూ చేస్తారు. ఈ వెర్షన్లో జోకర్ కార్డులు వాడవచ్చు. జోకర్లు డెక్‌లోని ఏదైనా కార్డుకు బదులుగా పనిచేయగలవని గమనించాలి.
ప్రతి కార్డూ దాని సంఖ్యకు అనుగుణంగా పాయింట్లను కలిగి ఉంటుంది. ప్రతి ఫేస్ కార్డూ పది పాయింట్లను కలిగి ఉంటుంది. చేతిలో ఉన్న అన్ని కార్డుల్నీ కలుపుతూ సున్నా స్కోరును చేరుకోవడం గేమ్ లక్ష్యం. దీన్ని మొదటగా ప్రకటించే ప్లేయరే విజేత.
పాయింట్స్ రమ్మీ అనేది 13 కార్డ్ రమ్మీలో ఒక రకం. కొత్తగా ఆట ప్రారంభించినవాళ్లకి ఇది అనువైనదిగా పరిగణించబడుతుంది. ఇది పూర్తి కావడానికి కొన్ని నిమిషాలు పడుతుంది.
డీల్ రమ్మీ అనేది మరో రకం. ఇది నిర్ణీత సంఖ్యలో డీల్స్‌ని కలిగి ఉంటుంది. ప్రతి ప్లేయర్ ఒకే సంఖ్యలో చిప్‌లను పొందడంతో గేమ్ మొదలవుతుంది. ప్రతి డీల్ ముగింపులో, ఓడిపోయినవారు తమ చిప్స్‌ను విజేతలకు ఇవ్వాలి. అన్ని డీల్స్ పూర్తయినప్పుడు, ఎవరి దగ్గర అత్యధిక విలువ కలిగిన చిప్స్ సేకరించబడి ఉంటాయో ఆ ప్లేయరే విజేత.
పూల్ రమ్మీ అనేది ఒక రకం, దీనిలో ప్లేయర్స్ అందరూ గేమ్ ఆడడానికి తమ చిప్స్‌నీ లేదా డబ్బునీ పూల్ చేస్తారు. ప్లేయర్స్‌లో ఒకరు 101 (లేదా 201) పాయింట్లకు చేరుకునే వరకు గేమ్ కొనసాగుతుంది, అలా చేరుకోగానే ఆ ప్లేయర్ గేమ్‌ని కోల్పోతాడు.
రమ్మీకుబ్
రమ్మీ మరియు మహ్జంగ్ రకాలకి చెందిన రమ్మీకుబ్ కార్డులకు బదులుగా టైల్స్‌తో ఆడతారు. గేమ్ 13 రకాల వేర్వేరు టైల్స్‌ని (1 నుండి 13 వరకు) 4 వేర్వేరు రంగులలో ఉపయోగించడం జరుగుతుంది. ఇందులో మొత్తం 104 టైల్స్ ఉంటాయి. 2 అదనపు టైల్స్ జోకర్లుగా పనిచేస్తాయి. రమ్మీతో సమామైన గేమ్‌గా ఉండడం ఈ గేమ్ ఉద్దేశ్యం. 3 సెట్లు లేదా సీక్వెన్సులలో టైల్స్ అమరుస్తారు. టైల్స్‌ని మొదటగా లే డౌన్ చేసిన ప్లేయర్ గెలుస్తాడు.
21 కార్డ్ రమ్మీ లేదా ఇండియన్ మ్యారేజ్
ఈ గేమ్ దీపావళి సందర్భంగా ఆడుతుంటారు, ఇది అంతగా ప్రాచుర్యం పొందింది. ఈ గేమ్ క్లాసిక్ రమ్మీ కంటే ఎక్కువసేపు నడుస్తుంది. మొత్తం 3 డెక్స్ కార్డులు ఉపయోగించబడతాయి, జోకర్లు కూడా ఉంటాయి. ప్రతి ప్లేయర్ 21 కార్డులతో ఆడతాడు. 3 ప్యూర్ రన్స్ చేసి, మిగిలిన కార్డుల్ని సరైన సెట్లు లేదా సీక్వెన్స్‌లుగా చేయాలి.
ఈ గేమ్ అడిషనల్ వేల్యూ కార్డుల్ని కూడా కలిగి ఉంటుంది, ఇవి జోకర్ కార్డుల మాదిరిగానే పనిచేస్తాయి, కానీ అవి ఎక్కువ పాయింట్లను కలిగి ఉంటాయి.
కెనస్టా
ఈ గేమ్‌ని 2 డెక్స్ కార్డులు 4 జోకర్లను ఉపయోగించి 2 జతలుగా కూర్చుని 4 ప్లేయర్స్ ఆడతారు. ప్రతి జోకర్ కార్డ్, అన్ని 2 వ నెంబరు కార్డులూ వైల్డ్ కార్డులుగా పనిచేస్తాయి. ఒకే ర్యాంక్‌లోని 7 కార్డులతో మెల్డ్స్ చేయడమే గేమ్ ఉద్దేశ్యం.
పాప్లు లేదా మేరేజి రమ్మీ
భారతదేశం, పొరుగు దేశాలైన నేపాల్, భూపాల్లోనూ రమ్మీని ఇష్టంగా ఆడే వ్యక్తులు ఈ రమ్మీ వెర్షన్‌ను ఇష్టపడతారు. 3 డెక్స్ కార్డులతో 2 నుండి 5 ప్లేయర్స్‌తో ఆడతారు. గేమ్‌లో ప్రింటెడ్ జోకర్లు ఉండవు కానీ, అందుకు బదులుగా వైల్డ్ కార్డ్ జోకర్లను ఉపయోగిస్తారు. ప్లేయర్స్ అందరూ 21 కార్డులతో ఆడతారు, వాళ్లు 3 కార్డులతో సెట్స్‌ని మాత్రమే చేయవలసి ఉంటుంది.
దీన్ని పాప్లు, నిచ్లు, టిప్‌లు వంటి సరదాగా ధ్వనించే అనేక పేర్లతో కూడా పిలుస్తారు. దీని గురించి మరిన్ని వివరాలను త్వరలో మరో వ్యాసంలో చదవవచ్చు.
జిన్ రమ్మీ
ఇది యూరోపియన్లకు బాగా ఇష్టమైన ఆట. ఇది రమ్మీలో ఈజీ వెర్షన్. ఇద్దరు ప్లేయర్స్ ఒక్కొక్కరూ 10 కార్డులతో గేమ్ ఆడతారు. ఈ గేమ్‌లో కార్డుల్ని 3 కార్డుల సెట్లుగా మెల్డ్ చేయాల్సి ఉంటుంది. ఏస్ విలువ ఇందులో కేవలం 1 పాయింట్ మాత్రమే, అన్ని ఫేస్ కార్డులకీ 10 పాయింట్లు, అన్ని నెంబర్ కార్డులకీ వాటి ప్రింట్ చేయబడి ఉన్న సంఖ్య విలువ కలిగి ఉంటాయి.
రమ్మీ 500
ఈ గేమ్ కూడా చాలామంది ఇష్టంగా ఆడతారు. ఈ గేమ్‌ని 13 కార్డులతో ఆడతారు. ఈ కార్డుల్ని మూడు సెట్లు లేదా సీక్వెన్స్‌లుగా మెల్డ్ చేయాల్సి ఉంటుంది. నెంబరు కార్డుల మీద ఫేస్ వేల్యూని బట్టి వాటి విలువ ఉంటుంది. ఫేస్ కార్డులు ఒక్కొక్కటి పది పాయింట్లు, జోకర్ల విలువ 15 పాయింట్లు. ఏదైనా మెల్డ్లో లేని కార్డు, పాయింట్స్ తగ్గింపుకు దారితీస్తుంది. 500 పాయింట్లకి చేరుకున్న మొదటి ప్లేయర్ గెలుస్తాడు. రమ్మీలో ఈ వెర్షన్ గురించి వివరించే మా ప్రత్యేక కథనాన్ని చూడండి.
డమ్మీ రమ్మీ
యుఎస్‌లో ఉద్భవించిన ఈ గేమ్ ఆడడం చాలా తేలికగా ఉంటుంది, ప్లేయర్స్‌కి ఉత్సాహాన్నిస్తుంది. 2 డెక్స్, 4 జోకర్లతో (మొత్తం 108 కార్డులు) ఈ గేమ్‌ని 2 నుండి 4 ప్లేయర్స్ మధ్య ఆడతారు. ఇందులో మొత్తం 2 నెంబరు కార్డులు వైల్డ్ కార్డ్ జోకర్లుగా ఉంటాయి. ప్రతి ప్లేయర్ 13 కార్డులతో ఆడాల్సి ఉంటుంది. అన్ని కార్డుల్నీ సరైన మెల్డ్స్లో టేబుల్ మీద పెట్టిన మొదటి వ్యక్తి విజేత.
కాంట్రాక్ట్ రమ్మీ
కాంబినేషన్ రమ్మీ, డ్యూసెస్ వైల్డ్ రమ్మీ, జోకర్ రమ్మీ, ఫేజ్ 10 అని కూడా పిలుస్తారు, ఇది ఒక జిన్ రమ్మీ రకం. ఇందులో 3 నుండి 8 మంది ప్లేయర్స్ ఆడతారు. గేమ్ మొత్తం 7 డీల్స్‌ని కలిగి ఉంటుంది. ప్రతి డీల్తోనూ నియమాలు మారతాయి. మొదటి నాలుగు రౌండ్లలో 10 కార్డులతో ఆడతారు, చివరి మూడు రౌండ్లలో 12 కార్డులతో ఆడతారు. జోకర్‌కి 25 పాయింట్లు, ఏసెస్కి 15 పాయింట్లు, ఫేస్ కార్డులు ఒక్కొక్కటి 10 పాయింట్లు కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ స్కోరింగ్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. అన్ని నెంబరు కార్డులకీ ప్రింట్ చేయబడిన విలువకి సమానమైన పాయింట్లు ఉంటాయి.
షాంఘై రమ్మీ లేదా కాలిఫోర్నియా రమ్మీ
ఈ గేమ్ కాంట్రాక్ట్ రమ్మీతో సమానంగా ఉంటుంది, ఇది చైనాలో బాగా ప్రాచుర్యం పొందింది, అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. రమ్మీ, కాంట్రాక్ట్ రమ్మీలకీ, ఈ వెర్షన్‌కీ మధ్య తేడా డీల్స్ నెంబర్ బట్టి ఉంటుంది. ఈ సందర్భంలో తేడా 10. ఇది 3 నుంచి 5 మంది ప్లేయర్స్ ఆడడానికి అనువైనది, గేమ్ 2 డెక్ కార్డులతో ఆడబడుతుంది. ప్రతి ప్లేయర్స్‌కి 11 కార్డులు వస్తాయి. బ్లాక్ సూట్లలో 2 నెంబర్స్‌ని జోకర్లుగా పరిగణిస్తారు. అన్ని కార్డుల్నీ మెల్డ్ చేయగలిగిన మొదటి వ్యక్తి విజేత అవుతారు.
కాబట్టి, ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రమ్మీలో ఎన్నో వెర్షన్స్. మీకు వీటిలో ఏది ఎక్కువగా నచ్చింది?