కార్డ్స్ గేమ్‌లో ప్రపంచ ప్రసిద్ధమైన సూక్తులు

The world’s greatest quotes on playing cards

మీ మెదడు కణాలకు మంచి వ్యాయామం చేయించడానికి రమ్మీ గేమ్‌ లేదా ఇతర కార్డ్ గేమ్ ఆడడం కొంత సరదానీ, ఉత్తేజాన్నీ అందించే ఉత్తమమైన మార్గం.

ఇంకా ఉత్తమమైనది ఏమిటో మీకు తెలుసా? ఈ చమత్కారమైన వన్ లైనర్స్‌ని గుర్తుంచుకోవడం చాలా తేలిక. ఇవి మీ స్నేహితులను నవ్విస్తాయి లేదా క్రొత్త కోణాల నుండి ఆలోచించేందుకు ప్రోత్సహిస్తాయి. 

 

చమత్కారమైన, సరదా అయిన ప్లేయింగ్ కార్డ్ సూక్తులు

“మగవారు కార్డ్స్ డెక్ లాంటివారు. మీకు అప్పుడప్పుడు రాజు కనిపిస్తుంటాడు, కానీ చాలా సార్లు జాక్‌లే ఎదురవుతాయి. ”

లోతైన, తాత్విక చింతన గల ప్లేయింగ్ కార్డ్ సూక్తులు

 

~ లారా స్వెన్సన్

“పురుషులు కార్డ్స్ డెక్ లాంటివారు, వారిని ప్రేమించేందుకు హార్ట్ కావాలి, వారిని వివాహం చేసుకోవడానికి ఒక డైమండ్, వారిని కొట్టడానికి ఒక క్లబ్, వారిని పాతిపెట్టడానికి ఒక స్పేడ్ కావాలి.”

 

~ పేరు తెలియని వ్యక్తి

“ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వినోదాలలో ఒకటి, ఒక డెక్ కార్డ్స్. ఇందులో నాలుగు సూట్స్‌లో పదమూడు చొప్పున కార్డులు  ఉంటాయి. హైలైట్ చేయబడిన రాజులు, రాణులు, జాక్‌లు ఉంటాయి, బహుశా వీళ్లు రాణిగారికి ఇష్టమైన యువకులు, ఆకర్షణీయమైన బాయ్‌ఫ్రెండ్స్ అయి ఉంటారు.”

 

– లెమనీ స్నికెట్

“ఏస్-కింగ్ ఉంటే ఫైన్ హ్యాండ్. ఏస్-క్వీన్ అయితే కొంచెం బలహీనంగా ఉన్నట్టే, అయినా ఫర్వాలేదు. ఏస్-జాక్‌ ఉంటే మీరు వేగంగా పతనమవుతున్నట్టే. ఏస్-టెన్‌తో, మీరు వాలు నుండి జారిపడి, శిఖరాగ్రం మీద నుంచి క్రింద పడినట్టే, ఏస్-ఫైవ్, ఏస్-సిక్స్ వంటి హ్యాండ్స్‌తో దిగువన శిధిలాల్లో పడ్డట్టే. ”

 

– డాన్ హారింగ్టన్

“మీరు మీ కార్డులను సరిగ్గా ప్లే చేస్తున్నారని మీరు అనుకున్నప్పుడు. దేవుడు డెక్‌ని షఫల్ చేస్తుంటాడు.”

 

~ మార్క్ షెప్పర్డ్

“జీవితం కార్డులున్న హ్యాండ్‌ లాంటిది. మీకు చేతిలోకి వచ్చిన కార్డులతోనే మీరు ఆడాలి, మీరు వాటిని ఫోల్డ్ ద్వారా గెలవలేరు, గెలవడానికి కొన్నిసార్లు మీరు అవకాశాలను తీసుకోవాలి.”

 

~ మైక్ కానర్

“క్రీడ అనే మారువేషం వేసుకొచ్చిన కార్డులు యుద్ధం లాంటివి.”

 

~ చార్లెస్ లాంబ్

విధి మీకు కొన్ని చెడ్డ కార్డుల్ని అందించిందా? అప్పుడు మీ జ్ఞానం మిమ్మల్ని మంచి గేమ్‌స్టర్‌గా తీర్చిదిద్దేందుకు అవకాశం ఇవ్వండి.

 

~ఫ్రాన్సిస్ క్వార్ల్స్

ప్రతి ప్లేయర్, అతడు లేదా ఆమె,  జీవితంలో తనకి వచ్చిన కార్డుల్ని యాక్సెప్ట్ చేయాలి: కానీ అవి చేతిలోకి వచ్చాక, అతను లేదా ఆమె మాత్రమే గేమ్‌ గెలవడానికి కార్డులు ఎలా ఆడాలో నిర్ణయించుకోవాలి.

 

~వోల్టేర్

 

ప్లేయింగ్ కార్డ్స్‌తో ఆడడం గురించిన సూక్తులు

మీరు కార్డులు ఆడుతున్నప్పుడు వాస్తవ ప్రపంచంలో మీకు ఎంత ఖర్చవుతుందో నిరంతరం ఆలోచించలేరు. మీరు విజయవంతం కావాలంటే దాని గురించి మీరు నిరంతరం ఆందోళన చెందలేరు.

 

~డేనియల్ నెగ్రేను

రమ్మీ అర్హతతో ప్రాచుర్యం పొందింది, ఎందుకంటే ఇది నేర్చుకోవడం సులభం, వేగంగా ఆడవచ్చు, ఇది అన్ని వయసుల వారికీ అనుకూలంగా ఉంటుంది, ఎంతమందైనా ఆడవచ్చు, జూదగాళ్లకు అనుకూలంగా ఉన్నట్టే, మిషనరీల కోసమూ అనుకూలంగా ఉంటుంది-బహుశా రెండూ ఒకేసారి కాకపోయినా.

 

~డేవిడ్ పార్లెట్

మీ కార్డ్ ప్లేయింగ్ స్నేహితులని అలరించడానికి మేము మీకు తగినన్ని వన్‌ లైనర్స్‌ని ఇచ్చామని ఆశిస్తున్నాము. వీటిలో మీకు నచ్చినదేది?