ఇది చదివిన తరువాత మీరు ఎన్నడూ కార్డ్స్‌ డెక్‌ని అంతకు ముందులా చూడలేరు

ఇది మీ డెక్ కార్డ్స్‌ని చూసే విధానాన్ని మార్చేస్తుంది

వివిధ రకాల కార్డ్ గేమ్స్ ఆడే ఆటగాళ్లు కోట్లాదిమ౦ది కాకపోయినా, లక్షలాది సంఖ్యలోనైనా ఉన్నారు, ఎన్నో శతాబ్దాలుగా ఉన్నారు. నైపుణ్యాల ఆధారితంగా రమ్మీ వంటి ఆటల్లో అదృష్టానికి తక్కువ పాత్ర ఉన్నా, దాని సహకారాన్ని పూర్తిగా లేదనుకోవడం కష్టం. రమ్మీ ఆన్ లైన్ గేమ్ మీ విశ్లేషణాత్మక సామర్థ్యాలకు పదును పెట్టుకుంటూ మీ సమయాన్ని మీరు చక్కగా గడపగల అత్యుత్తమ మార్గాల్లో ఒకటి. గేమ్ గురించి అవగాహనను పెంచుకోవడానికి మీరు దాన్ని గురించి తెలుసుకోవాలి, ఆ విషయాల్ని అవసరమైన వివిధ వ్యూహాల ద్వారా అన్వయించాలి. అంతే కాదు, ఆటలో నిరంతరం ఒక క్రమ పద్ధతిలో సీక్వెన్సులు, సెట్స్ చేస్తూ ఉండడం వల్ల మీ ఆర్గనైజేషనల్ స్కిల్స్ మెరుగుపడతాయి. వీటన్నిటికీ తోడు ఉచితంగా ఆన్ లైన్ రమ్మీ ఆడటం కూడా మీ టైమ్ మేనేజ్ మెంట్ స్కిల్స్‌ని మెరుగుపరచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాన్ని మీకు ఇస్తుంది. మీరు వేసిన స్టెప్స్‌ని తిరిగి ట్రేస్ చేస్తూ ఉంటే, మీలో సానుకూల పరివర్తన తీసుకొచ్చిన ఘనత కార్డ్స్ డెక్దేననే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు.

కొంతమంది ప్లేయర్స్, కార్డ్స్‌ డెక్ నిర్మాణం గురించి ఏమైనా ఆలోచించుకుంటూ ఉండవచ్చు గానీ ఒక డెక్ కార్డ్స్ ఎలా స్ట్రక్చర్ చేయబడ్డాయో, ప్రతి కార్డుకు ఆ యా విలువలు ఎలా కేటాయించడం జరిగిందో అంతా కేవలం యాదృచ్చికం కాక,  దాని వెనుక సైన్స్ ఉంది. కాలిక్యులేషన్ ఖచ్చితంగా ఉండేందుకు, ప్రతి కార్డుకీ ఒక సూక్ష్మమైన అర్థం ఉంటుంది. ఇదంతా కొందరికి కొత్తగా విజ్ఞానంలా ఉంటుంది, కానీ కార్డ్స్‌ అర్థం, డెక్ కార్డ్స్ మూలాల గురించి ప్రాచీన కాలం నుంచీ ఉనికిలో ఉన్న గాధలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి, మీరు చదవాల్సిన విషయానికి మిమ్మల్ని మీరు కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే దీని తరువాత, ఒక డెక్ కార్డ్స్‌ని అర్థం చేసుకోవడం మీకు చాలా తేలిక అని అర్థమవుతుంది.

52 డెక్ ఆఫ్ కార్డ్స్‌ విశిష్టత 

ఒక డెక్ కార్డ్ అనేది నిజానికి ఒక క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన అత్యంత అధునాతన రూపాల్లో ఒకటని మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. దీని వెనుక ఉన్న లెక్క గురించి మరింత తెలుసుకోవాలంటే ఇంకా చదవండి.

  • ప్రతి సంవత్సరంలోనూ 52 వారాలు ఉంటాయి, ఇవి ఒక డెక్ లో 52 కార్డ్స్‌గా వస్తాయి.
  • సంవత్సరంలో 4 ఋతువులు ఒక డెక్ కార్డ్స్‌లో ఉండే 4 సూట్లు సూచిస్తాయి.
  • ఒక సీజన్‌లో 13 లూనార్ సైకిల్స్/వారాలు ఉన్నట్టే ప్రతి సూట్‌లోనూ 13 కార్డ్స్ ఉంటాయి.
  • ఒక డెక్ లో 12 కోర్టు కార్డ్స్‌ ఉంటాయి, ఒక సంవత్సరంలో మొత్తం 12 నెలలు ఉన్నాయి.

ఇది ఎంత అద్బుతంగా ఉందో కదా? అంతే కాదు, ఒక డెక్ కార్డ్స్‌లోని ప్రతి కార్డు ఫేస్‌ వేల్యూనీ కలిపినపుడు (ఏస్ 1, జాక్ లు ఒక్కొక్క దానికీ 11, రాణుల్లో ప్రతి దానికీ 12,  రాజుల్లో ప్రతి దానికీ 13), అది మొత్తం 364 అవుతుంది. 

  • మీరు మొదటి జోకర్ ను 1 విలువతో జోడించినప్పుడు, మీకు 365 వస్తుంది, ఇది ఒక సాధారణ సంవత్సరంలో ఉన్న రోజులు.
  • రెండవ జోకర్ ను విలువ 1తో జోడించినప్పుడు, ఆ సంఖ్య 366 సమానం, ఇది లీపు సంవత్సరం రోజులు.

ఇంకా కాస్త లోతుగా వెళ్తే, ఒక డెక్ కార్డ్స్‌లో ప్రాధమికంగా ఎరుపు, నలుపు రెండు రంగులు ఉంటాయి. ఈ రెండూ పగలు, రాత్రికి ప్రాతినిధ్యం వహిస్తూ డెక్ కార్డ్స్‌లో కలిసి వస్తాయి.

 డెక్‌లో కార్డు పేరు కూడా ఒక మనిషి జీవితంలోని ఒక్కొక్క అంశానికి ప్రతీకగా నిలుస్తుందని కూడా నమ్ముతారు, అవి:

  • ఉపాధి కోసం స్పేడ్స్- జీవనోపాధిని సంపాదించడం, సమాజానికి ప్రొడక్టివ్ కాంట్రిబ్యూషన్ అందించడం.
  • ప్రేమ కోసం హార్ట్స్- జీవిత ప్రయాణంలో ఒక మనిషికి తోడుగా మరో మనిషి ఉండే దశని తెలియజేస్తుంది.
  • పెరుగుదల కోసం క్లబ్స్- ఒకరి ప్రయత్నాలకీ, శ్రమకీ ప్రతిఫలంగా వచ్చే రివార్డుకి ప్రతీకగా ఇది నిలుస్తుంది.
  • సంపద కోసం డైమండ్స్- తమ కోరికలను నెరవేర్చుకోవడానికి తగినంతగా జీవితం సమృద్ధిగా ఉండాలనే భావన.

మీకు కార్డ్స్‌ డెక్ గురించి ఇంత కంటే ఆసక్తికరమైన అర్థాలు తెలిస్తే, మీరు వాటిని  రమ్మీకల్చర్‌లో మాతో షేర్ చేసుకోండి. అలాగే, అద్భుతమైన బోనస్‌లు పొందడానికీ, రోజూ డబ్బు గెలుచుకోవడానికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన వైబ్రెంట్ ప్లేయర్స్‌ కమ్యూనిటీలో చేరండి. నేడే మన ఆప్ రమ్మీ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇక గేమ్ ఆడడం ప్రారంభించండి

Leave a Reply