గోప్యతా విధానం
రమ్మీకల్చర్‌లో, ఆన్లైన్ రమ్మీలో- స్కిల్ గేమ్స్‌ని ఒక విశ్వసనీయమైన వాతావరణంలో వినోదం కోసం, ఉత్సాహం కోసం ఆడవచ్చు. ఇందులో భాగంగా మా వినియోగదారుల గోప్యతను పరిరక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాము. గోప్యతా విధాన ప్రకటన మా సభ్యులు మరియు వినియోగదారుల నుంచి మేము ఏ సమాచారాన్ని సేకరిస్తాము, మేము ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము, ప్రాక్టీస్ గేమ్స్ & క్యాష్ గేమ్స్, రెండింటినీ యాక్సెస్ చేయడానికి వినియోగదారులు మా వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం గురించి వివరిస్తుంది. రమ్మీకల్చర్కు వినియోగదారుని ఒక వ్యక్తిగా గుర్తించే వినియోగదారు యొక్క వ్యక్తిగత సమాచారం కోసం మేము ఈ క్రింది వాటిని సేకరిస్తాము:
పేరు,
యూజర్ పేరు,
పోస్టల్ అడ్రస్,
టెలిఫోన్ లేదా మొబైల్ నెంబర్,
ఇమెయిల్ అడ్రస్,
బ్యాంక్ అకౌంట్ వివరాలు,
సోషల్ మీడియా అకౌంట్ ID (వినియోగదారు అనుమతిస్తే).
స్థానం
డివైస్ ఐడి,
IP చిరునామా,
పుట్టిన తేదీ
మీరు అవసరమైన సమాచారాన్ని అందించకపోతే, మేము అందించే ఫీచర్స్‌ని మీరు యాక్సెస్ చేయలేరు. ఇటువంటి సమాచారం మీ వ్యక్తిగత సమాచారంతో అనుసంధానించబడదు, వ్యక్తిగతంగా మీకు లింక్ చేయబడదు. ఈ సైట్లో సేకరించిన సమాచారానికి రమ్మీకల్చర్ ఏకైక యజమాని & పై సమాచారం మోసపూరితంగా గుర్తించకుండానూ లేదా ట్రెండ్ అనాలిసిస్ని నివారించడానికి గానూ అంతర్గత వినియోగం కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది. మేము ఈ సమాచారాన్ని ఇతరులకు అమ్మడం, పంచుకోవడం లేదా అద్దెకు ఇవ్వడం లేదా ఈ ప్రకటనలో వెల్లడించిన వాటికి భిన్నమైన మార్గాల్లో ఎన్నడూ ఉపయోగించము.
చట్టం ద్వారా లేదా చట్టబద్ధమైన అధికారం డిమాండ్ మేరకు తప్ప, మీ అనుమతి పొందకుండా మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని ఏ మూడవ పార్టీకీ వెల్లడించము, ఈ సందర్భంలో సమాచారాన్ని వెల్లడించే ముందు మేము మీకు తెలియజేస్తాము. అయితే, మా వెబ్సైట్లో రిజిస్టర్ చేయడం ద్వారా, మీ వ్యక్తిగత సమాచారాన్ని భాగస్వామ్యం చేయడానికి/లేదా ఈ గోప్యతా విధానంలో పేర్కొన్న విధంగా ఉపయోగించడానికి మీరు అనుమతి ఇస్తారు. చట్టం ప్రకారం అవసరమైనప్పుడు మేము సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. మీరు మాకు అందించే సమాచారాన్ని నష్టపరచకుండా, దుర్వినియోగం చేయకుండా, మార్చకుండా పరిరక్షించడానికి రమ్మీకల్చర్కి అవసరమైన సెక్యూరిటీ ఉంది. మీ రిజిస్ట్రేషన్ డేటా పాస్వర్డ్ ద్వారా భద్రంగా ఉంచబడుతుంది. మీ సమాచారాన్ని మీరు మాత్రమే యాక్సెస్ చేయవచ్చు. మీ పాస్వర్డ్ ఉపయోగించినప్పుడు చేపట్టే ఏ యాక్టివిటీకైనా మేము బాధ్యత వహించము. మీ పాస్‌వర్డ్‌ని ఎవరికీ వెల్లడించవద్దని మేము మీకు సూచిస్తున్నాము.
మా వెబ్‌సైట్‌ను ఉపయోగించడం ద్వారా, భవిష్యత్తులో రమ్మీకల్చర్ & దాని పార్ట్నర్స్, అనుబంధ సంస్థలు ఈ సమాచారాన్ని సేకరించడానికీ, వాడడానికీ, మీరు మీ సమ్మతిని ఇచ్చారని అర్థం చేసుకోవచ్చు. వారు ఖచ్చితంగా ఇక్కడిచ్చిన లేదా దీనికి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని సవరణపరంగా ఉపయోగించుకోవచ్చు. ఎప్పటికప్పుడు, మేము సమాచారాన్ని సేకరించే మా పద్ధతులను మార్చవచ్చు, మా గోప్యతా విధానాన్ని సవరించవచ్చు. మేము ఈ మార్పులను ఈ పేజీలో పోస్ట్ చేస్తాము, తద్వారా మేము ఏ సమాచారాన్ని సేకరిస్తాము, ఎలా ఉపయోగిస్తాము, ఏ పరిస్థితులలో మేము దానిని వెల్లడిస్తామన్న విషయాలను పోస్ట్ చేస్తాము.
మీరు మా వెబ్‌సైట్‌లోని ఏదైనా పేజీని సందర్శించిన ప్రతిసారీ కొన్ని రకాల సమాచారాన్ని నిల్వ చేయడానికి మేము కుకీలు, పిక్సెల్ ట్యాగ్స్, క్లియర్ జిఫ్స్ వంటి ఇతర సాంకేతిక పరిజ్ఞానాల్ని ఉపయోగిస్తాము. ఈ వెబ్‌సైట్‌కు ఇవ్వడానికి మీరు అంగీకరించిన సమాచారాన్ని గుర్తించడానికి కుకీలు ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తాయి. మీ వృత్తిపరమైన అవసరాలకు ఈ వెబ్‌సైట్‌లోని ఏ భాగాలు బాగా సరిపోతాయో గుర్తించడంలో మాకు సహాయపడతాయి. మీకు అడ్వర్టైజింగ్ బ్యానర్స్ని అందించడానికి మేము కుకీలను కూడా ఉపయోగించవచ్చు. ఈ బ్యానర్స్ మా ద్వారా లేదా మా తరపున థర్డ్ పార్టీ ద్వారా అందించబడతాయి. ఈ కుకీలలో వ్యక్తిగత సమాచారం ఉండదు. మీ వెబ్ బ్రౌజర్ కుకీలను అంగీకరించాలనుకుంటున్నారా లేదా అనేది మీ ఇష్టం. మీరు మీ కంప్యూటర్ సెట్టింగులను మార్చకపోతే, మీ బ్రౌజర్ ఇప్పటికే కుకీలను అనుమతించి ఉంటుంది. మీరు కుకీలను తిరస్కరించాలనే ఆప్షన్ని ఎంచుకుంటే, మీరు వెబ్‌సైట్‌కి సంబంధించిన అన్ని ఫీచర్లనూ పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేయలేరు. మీరు మీ బ్రౌజర్ కుకీలను కూడా తొలగించవచ్చు లేదా వాటిని పూర్తిగా నిలిపివేయవచ్చు.
కస్టమర్ డివైస్‌లలో రమ్మీకల్చర్ కుకీస్ లైఫ్‌టైమ్ ఉంచబడతాయి. కానీ ఇది మా వెబ్‌సైట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది, మా వెబ్‌సైట్‌లోని భాగాలను పనిచేయని విధంగానూ లేదా యాక్సెస్ చేయలేని విధంగానూ చేస్తుంది. మీరు వాటిని ఆన్ చేసి వదిలేయమని మేము సిఫార్సు చేస్తున్నాము. ఇంటర్నెట్ అంతటా కొన్నిసార్లు పెద్ద వెబ్సైట్లు ఉపయోగించే ఇండస్ట్రీ స్టాండర్డ్ టెక్నాలజీతో ఈ సైట్లో ఒక పిక్సెల్ ట్యాగ్ లేదా ఎస్డికేని ఉపయోగించి మా తరఫున కొన్ని యాడ్స్‌కి సెర్వ్ చేయడానికి మేము మూడవ పార్టీ సేవా ప్రదాతలను ఉపయోగిస్తాము. ఈ ప్రక్రియలో వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం సేకరించబడదు లేదా ఉపయోగించబడదు. వారికి పేరు, ఫోన్ నెంబర్, చిరునామా, ఇమెయిల్ చిరునామా లేదా వినియోగదారు గురించి వ్యక్తిగతంగా గుర్తించే సమాచారం తెలియదు.
మొబైల్ సంఖ్య ధృవీకరణ
రమ్మీకల్చర్‌లో మీరు క్యాష్ గేమ్స్‌ని ఆడడానికి మీ మొబైల్ నెంబర్ని ధృవీకరించాలి. రమ్మీకల్చర్‌లో ఏ విధంగానూ మోసాలకు తావు లేకుండా సురక్షితంగా ఉంచడం కోసమే ఇలా చేయబడుతుంది. మీ సమాచారం అంతా గోప్యంగా ఉంచబడుతుంది & ఏ కారణంగానూ ఏ వ్యక్తి లేదా పార్టీతో దాన్ని షేర్ చేసుకోవడం జరగదు. రమ్మీకల్చర్‌లో మొబైల్ ప్రామాణీకరణ ప్రక్రియను క్యాష్ వినియోగదారులందరూ తప్పనిసరిగా అనుసరించాలి.
చట్టం, నియంత్రణ లేదా చట్టపరమైన అభ్యర్థనను పాటించడం సహేతుకమైన అవసరమని మేము విశ్వసిస్తే ఏ వ్యక్తి భద్రతనైనా పరిరక్షించడానికి; మోసం, భద్రత లేదా సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి; లేదా రమ్మీకల్చర్ హక్కులు లేదా ఆస్తిని రక్షించడానికి గాను ఈ పాలసీకి విరుద్ధంగా ఉన్న మీ సమాచారాన్ని దేన్నైనా సరే, మేము భద్రపరచవచ్చు లేదా వెల్లడి చేయవచ్చు; ఏదేమైనా, ఈ గోప్యతా విధానంలో మీ సమాచారాన్ని బహిర్గతం చేయడానికి, ప్రభుత్వ అభ్యర్థనతో సహా మూడవ పక్షానికి మీరు కలిగి ఉన్న చట్టపరమైన రక్షణలు లేదా అభ్యంతరాలను పరిమితం చేయడానికి ఉద్దేశించినది కాదు. మా నియంత్రణలో ఉన్న సమాచారాన్ని రక్షించడానికి రమ్మీకల్చర్ సహేతుకమైన సంస్థాగత, సాంకేతిక మరియు పరిపాలనా చర్యలను ఉపయోగిస్తుంది.
మా నియంత్రణలో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడానికి మేము సహేతుకమైన సంస్థాగత, సాంకేతిక మరియు పరిపాలనా చర్యలను ఉపయోగిస్తాము.
ఏదేమైనా, ఇంటర్నెట్ లేదా డేటా స్టోరేజి వ్యవస్థ ద్వారా డేటా ప్రసారం 100% సురక్షితమని హామీ ఇవ్వబడదు. రమ్మీకల్చర్ ఫీచర్లతో యూజర్లు తమ ఇంటరాక్షన్ ఇకపై సురక్షితం కాదని నమ్మడానికి కారణం ఉంటే (ఉదాహరణకు, రమ్మీకల్చర్తో తమకు ఉన్న ఏదైనా అకౌంట్ సెక్యూరిటీ భంగమైందని వారు భావిస్తే), సమస్యని కస్టమర్ సేవా సిబ్బందిని సంప్రదించడం ద్వారా రమ్మీకల్చర్కి వెంటనే తెలియజేయడం వారి బాధ్యత. రమ్మీకల్చర్ అలాంటి పరిస్థితులలో, రమ్మీకల్చర్కి పరిస్థితులకి తగిన అవసరమైన చర్య తీసుకుంటుంది. మీ వ్యక్తిగత లేదా ఇతర సమాచారాన్ని సురక్షితంగా ఉంచడంలో మీ వైఫల్యం ఫలితంగా మీ ఖాతాలోని ఏదైనా యాక్టివిటీకి రమ్మీ కల్చర్ బాధ్యత వహించదు.
మీరు మా సేవలతో రిజిస్టర్ చేసుకున్న తర్వాత, మీ అకౌంట్‌కి అనుబంధించబడిన మీ రిజిస్ట్రేషన్‌కు అనుగుణంగా మీరు మాకు అందించిన వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి లేదా మార్చడానికి మీకు అవసరమైన టూల్స్ మరియు అకౌంట్ సెట్టింగ్‌లను మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది.
ఈ గోప్యతా విధానం ఉపయోగ నిబంధనలతో కలిపి చదవాలి మరియు ఈ పాలసీ నిబంధనలకు వర్తించే చోట రమ్మీకల్చర్ ఉపయోగ నిబంధనలతో కలిపి రెండింటినీ చూడవచ్చు.
మేము ఎప్పటికప్పుడు ఈ గోప్యతా విధానాన్ని సవరించవచ్చు లేదా సంస్కరించవచ్చు. విధానం యొక్క ప్రస్తుత వెర్షన్ మీ సమాచారాన్ని మేమెలా వినియోగిస్తామనే విషయాన్నీ, మీ సేవల వినియోగాన్నీ నియంత్రిస్తుంది. అటువంటి మార్పులు ప్రభావవంతంగా మారిన తర్వాత సేవలను యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం కొనసాగించడం ద్వారా, మీరు సవరించిన/సంస్కరించిన గోప్యతా విధానానికి కట్టుబడి ఉంటారని అంగీకరిస్తున్నారు.
ఈ గోప్యతా విధానం భారతదేశ చట్టాలచే నిర్వహించబడుతుంది. ఈ గోప్యతా విధానానికి సంబంధించిన మరియు ఉత్పన్నమయ్యే అన్ని వివాదాలు, వాదనలు, కారణాలు కర్ణాటకలోని బెంగళూరులోని న్యాయస్థానాల ప్రత్యేక అధికార పరిధికి లోబడి ఉంటాయి.
ఏదైనా ప్రశ్న కోసం మీరు support@rummyculture.com కు వ్రాయవచ్చు.
మరిన్ని వివరాల కోసం దయచేసి మా సేవా నిబంధనలను చూడండి