రమ్మీకల్చర్ మరియు/లేదా దాని భాగస్వాములు, సబ్సిడరీలు, అనుబంధ సంస్థలు, అసోసియేట్స్ (ఇకపై “రమ్మీకల్చర్” లేదా “మేము” లేదా “మమ్మల్ని” లేదా “మా” అనే పదాలు ఉపయోగించడతాయి) అందించే ప్రొడక్ట్/లేదా సేవలు (ఇకపై “సేవలు” అని సూచించబడుతుంది) www.rummyculture.com (ఇకపై “వెబ్సైట్” గా సూచిస్తారు) వెబ్సైట్ ద్వారా ఈ క్రింది సేవా నిబంధనల (ఇకపై “నిబంధనలు” గా సూచించబడుతుంది) కు లోబడి అందించబడతాయి.
మా సేవలను ఉపయోగించే ముందు ఏ/ప్రతి వినియోగదారుడూ అన్ని నిబంధనలనూ జాగ్రత్తగా చదవాలి. అన్ని నిబంధనలూ వినియోగదారులందరికీ వర్తిస్తాయి, ఎప్పటికప్పుడు వర్తించే నిబంధనలకు లోబడి ఉన్నప్పుడు మాత్రమే వారు మా సేవలను పొందగలరు. వినియోగదారులు అప్డేట్ చేయబడిన లేదా సవరించిన లేదా ప్రచురించిన అన్ని నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకోవలసిన అవసరం ఉంది.
భారతదేశంలో ఒక జుడీషియల్ లేదా క్వాసీ- జుడీషియల్ సంస్థ ఏ కారణం చేతనైనా మా నిబంధనలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నిబంధనల్ని చెల్లవనీ, చట్టవిరుద్ధమనీ నిర్ణయించిన సందర్భంలో, మా మిగిలిన నిబంధనల చెల్లుబాటు లేదా అమలుకావడం ప్రభావితం కాదు, ఎందుకంటే వాటికి వాలిడిటీ ఉంటుంది, అవి వినియోగదారులందరికీ వర్తిస్తాయి.
మా సేవా నిబంధనలను అంగీకరించని ఏ యూజర్ అయినా మా వెబ్‌సైట్‌కి చెందిన ఏ ఫీచర్నైనా ఉపయోగించడాన్ని ఆపివేయవచ్చు.
అప్లికబిలిటీ:
మీరు మాతో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందు, వెబ్‌సైట్‌లోని అన్ని సేవలకు ప్రొడక్ట్-స్పెసిఫిక్ కండిషన్స్, అలాగే రమ్మీకల్చర్ సైట్లో అందించిన స్పెసిఫిక్ ఆఫరింగ్స్కి వర్తించే నిబంధనలను మీరు జాగ్రత్తగా చదవాలి, సమీక్షించాలి.
అర్హత:
18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తి మా సేవలను ఉపయోగించడానికి అర్హులు. ఏదేమైనా ఒక వ్యక్తి వయో పరిమితులను ఉల్లంఘిస్తే, అనుసరించాల్సిన చట్టపరమైన చర్యలను భరించడం అతని/ఆమె ఏకైక బాధ్యత.
మా సేవలు భారతదేశంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని వినియోగదారు అర్థం చేసుకోవాలి. మేము భారతదేశంలోని అస్సాం, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు నాగాలాండ్ రాష్ట్రాల్లో మా సేవలను అందించము. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని సమయాల్లోనూ మా సేవలకు యాక్సిసిబిలిటీని నియంత్రించే హక్కు మాకు ఉంది. భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా చట్ట/నియంత్రణ/పాలనలో మార్పులను ప్రతిబింబించేలా ఈ ఉపయోగ నిబంధనలు తగిన విధంగా సవరించబడతాయి, అటువంటి మార్పులు సంభవించినప్పుడు వినియోగదారుకు దాని గురించి తెలియజేయబడుతుంది.
నైపుణ్యంతో ఆడే గేమ్ :
భారతదేశంలో రమ్మీని ఆడడం పూర్తిగా చట్టబద్ధమైనది, ఎందుకంటే ఇది ‘గేమ్ ఆఫ్ స్కిల్’ కేటగిరీ పరిధిలోకి వస్తుంది, అంటే గేమ్ ఫలితం నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది తప్ప అదృష్టం మీద కాదు.
గేమ్ సేవలు:
వెబ్సైట్లో నిర్వహించే అన్ని టోర్నమెంట్, ప్రమోషనల్ గేమ్స్, ప్రాక్టీస్ గేమ్స్, క్యాష్ గేమ్స్ అన్నింటినీ కలిపి “గేమ్స్” గా వ్యవహరిస్తాము. అన్ని రకాల గేమ్స్‌కీ వర్తించే నియమాలు వెబ్సైట్లో అందించబడతాయి.
“క్యాష్ గేమ్ (లు)” అనేవి పాల్గొనేవారు, పాల్గొనడానికి తమ వినియోగదారు అకౌంట్లో కనీస క్యాష్ బ్యాలెన్స్ కలిగి ఉండవలసిన గేమ్స్. వెబ్సైట్లో అందించే అన్ని ఇతర గేమ్స్‌ని క్యాష్ లేని గేమ్ (లు) గా నిర్వచించబడ్డాయి.
రమ్మీకల్చర్ క్యాష్ గేమ్స్ కోసం సేవా ఛార్జీలను వసూలు చేస్తుంది, ఇవి క్యాష్ గేమ్ స్వభావాన్ని బట్టి మారవచ్చు, ఇవి సందర్భాన్ని బట్టి ఎప్పటికప్పుడు మార్పుకి లోబడి ఉంటాయి. క్యాష్ రహిత గేమ్స్ వెబ్సైట్లో ఫ్రీగా అందించబడతాయి, అయితే కొన్ని సందర్భాల్లో ప్రవేశ పరిమితులకు లోబడి ఉండవచ్చు. రమ్మీకల్చర్ వసూలు చేసే సేవా ఛార్జీలు వస్తువులు & సేవల పన్నుతో సహా వర్తించే అన్ని పన్నులను కలిగి ఉంటాయి.
వినియోగదారు ప్రాతినిధ్యాలు:
రిజిస్ట్రేషన్ దశలోనైనా లేదా ఎప్పుడైనా మీరు మాకు అందించిన ఏదైనా సమాచారం పూర్తి నిజాయితీతో కూడినదై ఉండాలి.
మీ వినియోగదారు అకౌంట్‌కు క్యాష్‌ను జోడించడానికి లేదా క్యాష్ గేమ్స్‌లో పాల్గొనడానికి ముందు, మీరు క్యాష్ గేమ్స్‌ని యాక్సెస్ చేస్తున్న అధికార పరిధిలో క్యాష్ గేమ్స్‌ని ఆడడంలోని చట్టబద్ధత గురించి మీకు మీరు సంతృప్తి చెందాలి. భారతదేశంలోని బ్యాంకింగ్ ఛానెళ్ల ద్వారా వ్యక్తిగతంగా భారతీయ రూపాయి ట్రాన్జాక్షన్లోకి ప్రవేశించడానికి/లేదా అనుమతించబడిన అధికార పరిధి నుంచి వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోతే, వెబ్సైట్లో క్యాష్ గేమ్స్‌లో పాల్గొనడం మీకు నిషేధించబడింది. అటువంటి ఉల్లంఘన జరిగితే, క్యాష్ గేమ్స్‌లో మీరు పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించినట్టుగా పరిగణించబడుతుంది. అటువంటి క్యాష్ గేమ్స్‌లో మీరు గెలుచుకునే ఎలాంటి బహుమతినైనా స్వీకరించడానికి మీకు అర్హత ఉండదు.
ఏ క్యాష్ గేమ్స్‌లోనైనా పాల్గొనడానికి మీకు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉందనీ, ఇతర వినియోగదారులతో రమ్మీ కల్చర్ ట్రాన్జాక్షన్స్లోకి ప్రవేశించడానికి కూడా సమర్థులనీ మీరు తెలియజేస్తున్నారు. మాచే నిర్వహించబడిన గేమ్స్‌లో (“యాక్టివిటీ”) పాల్గొనడం వల్ల మీకు ఆర్థిక నష్టం వాటిల్లవచ్చని మీకు తెలుసు. ఈ యాక్టివిటీకు సంబంధించిన వాస్తవాలు మరియు పరిస్థితులపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండి, మీరు స్వచ్ఛందంగా యాక్టివిటీలో పాల్గొంటున్నారు. ఆర్థిక నష్టానికి సంబంధించిన అన్ని రిస్కులతో సహా మీరు పాల్గొనడం వల్ల కలిగే అన్ని బాధ్యతలనూ, నష్టాల్నీ మీరు స్వీకరిస్తారు. ఈ యాక్టివిటీలో మీ భాగస్వామ్యంతో సంబంధం ఉన్న ఏదైనా మరియు అన్ని క్లెయింల ఖర్చులకు సంబంధించి రమ్మీకల్చర్, దాని ఉద్యోగులు, డైరెక్టర్, అధికారులు ఏజెంట్లు ఎలాంటి హానిచేయనివారని ధృవీకరించడానికి మీరు అంగీకరిస్తున్నారు.
యాక్టివిటీలో పాల్గొనడానికి మీకు అనుభవం, అవసరమైన నైపుణ్యాలు ఉన్నాయనీ మరియు యాక్టివిటీలో పూర్తిగా పాల్గొనే మీ సామర్థ్యాన్ని దెబ్బతీసే శారీరక లేదా మానసిక స్థితి గురించి మీకు తెలియదని మీరు సూచిస్తున్నారు. మీరు ఈ యాక్టివిటీ పాల్గొనడం లేదా ఈ యాక్టివిటీతో లేదా ఈ యాక్టివిటీకి అనుబంధంగా ఉన్న విషయాల్లో సంబంధం కలిగి ఉండడం వలన కలిగే ఏదైనా పరిణామానికి మీరు మాత్రమే బాధ్యత వహిస్తారని మీరు అంగీకరిస్తున్నారు. ఈ యాక్టివిటీ పాల్గొనడం వలన మీరు కొనసాగించే ఏదైనా ఆర్థిక నష్టానికి రమ్మీకల్చర్ ఎటువంటి బాధ్యత లేదా బాధ్యత వహించదని మీరు అర్థం చేసుకున్నారు.
వెబ్సైట్లో అందుబాటులో ఉన్న గేమ్‌లో మీరు పాల్గొనడం వల్ల మీకు బహుమతి ఇవ్వవలసిన బాధ్యత మాపై ఉండదని మీరు అర్థం చేసుకున్నానని అంగీకరిస్తున్నారు. మీరు బహుమతిని గెలుచుకోవడం అనేది పూర్తిగా గేమ్‌లో ప్లేయర్‌గా మీ నైపుణ్యం మీదా, ఇతర గేమ్ ప్లేయర్స్ నైపుణ్యాల మీదా ఆధారపడీ మరియు గేమ్ నియమాలకు లోబడీ ఉంటుంది.
మీరు వెబ్సైట్లో పోస్ట్ చేసిన, ప్రసారం చేసిన, అప్లోడ్ చేసిన లేదా అందుబాటులో ఉంచిన అన్ని కంటెంట్లకు మీరే బాధ్యత వహిస్తారని మీరు అర్థం చేసుకున్నానని అంగీకరిస్తున్నారు. మీరు పోస్ట్ చేసిన ఏ కంటెంట్ అయినా చట్టబద్ధంగా మీ స్వంతానిదై లేదా మీ వద్ద లైసెన్స్ కలిగినదై అయి ఉండాలి. వెబ్సైట్లో ఏదైనా కంటెంట్‌ను ప్రచురించడం ద్వారా, మాకు రాయల్టీ-రహితంగా, ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకమైన, శాశ్వతమైన కేటాయించదగిన హక్కును ఉపయోగించడానికీ, కాపీ చేయడానికీ, పునరుత్పత్తి చేయడానికీ, సవరించడానికీ, స్వీకరించడానికీ, ప్రచురించడానికీ, ఎడిట్ చేయడానికీ, అనువదించడానికీ, దాన్నించి ఉత్పన్నమయ్యే రచనలను చేయడానికీ మరియు మీ కంటెంట్ నుంచి, ప్రసారం, పంపిణీ, బహిరంగంగా ప్రదర్శించడానికీ, మా లేదా మా అనుబంధ సంస్థలు ప్రొడ్యూస్ చేసే ఏదైనా సంబంధిత మార్కెటింగ్ సామగ్రిలో అటువంటి కంటెంట్‌ను ఉపయోగించడానికీ మీరు అంగీకరిస్తున్నారు. ఇటువంటి కంటెంట్‌లో ఎలాంటి పరిమితీ లేకుండా, మీ పేరు, వినియోగదారు పేరు, ప్రదేశం, సందేశాలు, లింగం లేదా చిత్రాలు ఉండవచ్చు. మీ కంటెంట్‌ను కలుపుకొని ఏదైనా మెటీరియల్‌ని చేర్చుకోవడానికి మీరు చట్టబద్ధమైన లేదా అందుకు సమానమైన హక్కులను పొందలేరని కూడా మీరు అర్థం చేసుకున్నారు. రమ్మీకల్చర్కి మీరు అందించిన అన్ని కమ్యూనికేషన్ లేదా ఫీడ్‌బ్యాక్‌లను ఏ విధంగానైనా ఉపయోగించుకునే హక్కు ఉందని మీరు అంగీకరిస్తున్నారు, గుర్తిస్తున్నారు.
రమ్మీకల్చర్లోని మీ యూజర్ అకౌంట్లోని ఫండ్స్ ఎలాంటి వడ్డీ లేదా రాబడిని కలిగి ఉండవని మీరు అర్థం చేసుకున్నారు.
మీరు పాల్గొనడానికి అర్హత ఉన్న ఏ గేమ్‌నైనా ఆడలేకపోతున్నందుకు మీరు రమ్మీకల్చర్ని బాధ్యత వహించేలా చేయలేరు. ఇది మీ వినియోగదారు అకౌంట్ ధృవీకరణ పెండింగ్‌లో ఉండవచ్చు లేదా మీరు ఏవైనా నిబంధనలను ఉల్లంఘించినట్టు అనుమానింపబడడం లేదా నిరూపించబడి ఉండడం వంటి పరిస్థితులు, ఇక్కడికే పరిమితం కాక ఇలాంటి మరెన్నో పరిస్థితుల్లో మీరు మీ వినియోగదారు అకౌంట్లోకి లాగిన్ కాలేరు.
వెబ్‌సైట్‌ను చూడడం లేదా ఉపయోగించడం ద్వారా లేదా ఏవైనా సేవలను పొందడం ద్వారా లేదా వెబ్సైట్లో కమ్యూనికేషన్ ఫీచర్లను ఉపయోగించడం ద్వారా, మీరు ఇతర వినియోగదారులు పోస్ట్ చేసిన కంటెంట్‌ని చూసే అవకాశం ఉండవచ్చు, అవి మీకు నిందాత్మకంగానూ, అభ్యంతరకరమైనవిగానూ, లేదా అసభ్యకరమైనవిగానూ అనిపించవచ్చు. ఇతర వినియోగదారులు పోస్ట్ చేసిన ఇలాంటి కంటెంట్‌ని మీరు మా దృష్టికి తీసుకురావచ్చు, మీరు నిందాత్మకంగానూ, అభ్యంతరకరమైనవిగానూ, లేదా అసభ్యకరమైనవిగానూ భావించిన కంటెంట్‌పై మేము తగిన రీతిగా చర్య తీసుకునే హక్కు మాకు ఉంది. ఈ విషయంలో మేము తీసుకునేదే అంతిమ నిర్ణయం. అది మీపై ఆధారపడి ఉంటుంది.
వినియోగదారు అకౌంట్ క్రియేషన్ మరియు ఆపరేషన్:
మా సేవలను ఉపయోగించడానికి, మీరు వెబ్సైట్లో మాతో రిజిస్టర్ చేసుకోవాలి.
వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్టర్ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా, మీరు నిబంధనలను అంగీకరించడాన్ని మీరు ధృవీకరిస్తారు.
రమ్మీకల్చర్‌లో రిజిస్టర్ కావడం ద్వారా, టోర్నమెంట్ & బోనస్‌కు సంబంధించిన ప్రమోషనల్ మెసేజిలను ఎస్ఎంఎస్, ఇమెయిల్, కాల్ మరియు పుష్ నోటిఫికేషన్ల ద్వారా స్వీకరించడానికి మీరు అంగీకరిస్తున్నారు. support@RummyCulture.com కు ఇమెయిల్ పంపడం ద్వారా మీరు మీ సమ్మతిని విత్‌డ్రా చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో, తప్పనిసరికాని ఇతర సమాచారాన్ని అందించడానికి అదనంగా మీరు లాగిన్ పేరు, పాస్‌వర్డ్‌ని ఎంచుకోవాలి. అదనంగా, మీరు మీ వినియోగదారు అకౌంట్ ధృవీకరణ/లేదా మీ వినియోగదారు అకౌంట్‌కు క్యాష్‌ని యాడ్ చేయడం కోసం మరింత వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుంది. మీ పేరు, పోస్టల్ చిరునామా, ఇమెయిల్ చిరునామా, టెలిఫోన్ నెంబర్ (లు), మొదలైనవాటికే పరిమితి కాకుండా, వాటితో సహా మీ వ్యక్తిగత సమాచారం అవసరమయ్యే అన్ని ఫీల్డ్స్లోనూ మీరు సరైన వివరాలను మాకు ఇవ్వాలి. మీరు ఈ సమాచారాన్ని అప్డేట్ చేసి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న సమాచారం ఉంచడానికి మీరు బాధ్యత పడ్డారు.
ఈ సమాచారం ఖచ్చితత్వాన్ని మేము ఎప్పుడైనా ధృవీకరించమని మేము కోరవచ్చని మీరు అంగీకరిస్తున్నారు. అలా చేయడానికి మీ నుంచి అదనపు డాక్యుమెంటరీ రుజువు అవసరం కావచ్చు, విఫలమైతే వెబ్సైట్లో మీ రిజిస్ట్రేషన్‌ని నిలిపివేయడానికి లేదా తొలగించడానికీ మాకు హక్కు ఉంది.
మీరు మాకు అందించిన ఏ సమాచారం అయినా మీకు తెలిసినంతవరకు పూర్తి నిజాయితీతో కూడినదై ఉండాలి. మీరు అందించిన సమాచారాన్ని సరైనదా కాదా సరిచూడడానికీ లేదా ధృవీకరించడానికీ మేము బాధ్యత వహించము. మీరు తప్పు సమాచారం అందించడం లేదా మా నుంచి ఏదైనా సంబంధిత సమాచారాన్ని దాచడం వలన ఏదైనా ఫలితం లేదా పర్యవసానాలకు మేము ఎటువంటి బాధ్యత వహించము.
మీ వినియోగదారు పేరు, పాస్వర్డ్, ఇమెయిల్ అడ్రస్, సంప్రదింపు వివరాలు, మొబైల్ నెంబర్‌కే పరిమితం కాకుండా, వాటితో సహా వెబ్సైట్లో మీరు అందించే సమాచారాన్ని రక్షించడం మీ బాధ్యత అని మీరు అర్థం చేసుకున్నారు. రమ్మీకల్చర్ లాగిన్ సమయంలో తప్ప ఎన్నడూ మీ యూజర్ అకౌంట్ లాగిన్ పాస్‌వర్డ్‌ని అడగదు. వెబ్సైట్లో లేదా మరెక్కడైనా ఏ వినియోగదారుకైనా మీరు మీ లాగిన్ యూజర్ అకౌంట్ సమాచారాన్ని ఎన్నడూ ఇవ్వకూడదు. మీ యూజర్ నేమ్‌ని ఉపయోగించి మీ యూజర్ అకౌంట్ నుంచి ఆడడానికి మీరు అనుమతించరు/లాగిన్ అవనివ్వరు మరియు వేరే ఎవరినీ మీ యూజర్ అకౌంట్ నుంచి ఆడడానికి అనుమతించకుండా ఉండడానికి మీరు బాధ్యత తీసుకుంటున్నారు. వెబ్‌సైట్‌లోని మీ యూజర్ అకౌంట్ మరే ఇతర వ్యక్తి ద్వారా అయినా ఎక్స్పోజ్ చేయబడడానికీ లేదా దుర్వినియోపరచబడడానికీ కారణమయ్యే ఎవరికైనా మీరు అందించిన సమాచారం కోసం మేము ఎటువంటి బాధ్యత వహించబోమని మీరు ప్రత్యేకంగా అర్థం చేసుకున్నారు, అంగీకరిస్తున్నారు.
మీ రమ్మీకల్చర్ యూజర్ అకౌంట్‌ను వెబ్సైట్లో ఆడడం కోసం వెబ్‌సైట్‌లోని సేవలను పొందటానికి సంబంధించి మీరు నిర్వహించాల్సిన ట్రాన్జాక్షన్ల కోసం మాత్రమే ఉపయోగిస్తామని మీరు అంగీకరిస్తున్నారు. నిబంధనలలో పేర్కొన్నది కాకుండా వేరే ఏ కారణం చేతనైనా మీ యూజర్ అకౌంట్‌ని ఉపయోగించడం లేదా అందుకు ప్రయత్నించడం వలన మీ యూజర్ అకౌంట్ వెంటనే రద్దు చేయబడవచ్చు, యూజర్ అకౌంట్లో ఏదైనా బహుమతి, బోనస్ లేదా బ్యాలెన్స్ ఉన్నా అది కోల్పోవచ్చు.
మా వద్ద మెయింటైన్ చేయబడుతున్న మీ యూజర్ అకౌంట్లోని డిపాజిట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన క్యాష్ గేమ్స్‌లో పాల్గొనడం కోసం మాత్రమే అని మీరు అర్థం చేసుకున్నారు, అంగీకరిస్తున్నారు.
రమ్మీకల్చర్ చేత అనుమతించబడిన మరియు నిర్దేశించబడిన పరిమితులు, షరతులకు లోబడి తప్ప, మీ యూజర్ అకౌంట్ నుంచి మాతో పాటు వెబ్‌సైట్‌లోని మరొక రిజిస్టర్డ్ యూజర్ అకౌంట్‌కు బదిలీ చేయలేమని మీరు అర్థం చేసుకున్నారు, అంగీకరిస్తున్నారు.
ఒక సింగిల్ టోర్నమెంట్, ఒక పూల్ రమ్మీ గేమ్ లేదా ఒక సింగిల్ పాయింట్స్ రమ్మీ గేమ్స్ లాంటి ఏ గేమ్లోనైనా రు. 10,000/- కంటే ఎక్కువ గెలిచినప్పుడు మాత్రమే టాక్స్ ఎట్ సోర్స్ (టీడీఎస్) ను కట్ చేయడానికి మేము చట్టబద్ధంగా బాధ్యత వహిస్తున్నాము. ఈ సందర్భాలలో, మీరు ఇప్పటికే అలా చేయకపోతే ఆదాయపు పన్ను అధికారులు మీకు జారీ చేసిన మీ పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) ను మీరు నింపాల్సి ఉంటుంది. 30% చొప్పున టీడీఎస్ ఆటోమేటిక్‌గా అటువంటి విన్నింగ్స్ నుంచి తీసివేయబడుతుంది, మిగిలినది మీ రమ్మీకల్చర్ యూజర్ అకౌంట్‌కు జమ చేయబడుతుంది. మీరు మీ సరైన పాన్ వివరాలను అందించిన తర్వాత మాత్రమే ఈ విన్నింగ్స్ విత్‌డ్రాయల్ అనుమతించబడుతుంది. ఈ లిమిట్స్, రేట్స్ ప్రస్తుత నియమ నిబంధనల ప్రకారం మార్పుకు లోబడి ఉంటాయి. ఈ విషయంలో చట్ట ప్రకారం టీడీఎస్‌ను తగ్గించడం, మీకు పన్ను మినహాయింపుకి సంబంధించి తగిన ధృవీకరణ పత్రాన్ని అందించడం వరకే రమ్మీకల్చర్ బాధ్యత. మీ వ్యక్తిగత పన్ను విషయాలకు మేము మీకు ఎలాంటి సలహా ఇవ్వడం గానీ లేదా ఏ విధంగానైనా బాధ్యత వహించడం గానీ జరగదు.
మీ పాన్‌ను ఎప్పటికప్పుడు ధృవీకరించే హక్కు మాకు ఉంటుంది. మా ధృవీకరణ ప్రక్రియలో మీ పాన్ సరిగ్గా లేదని గుర్తించినట్లయితే ఏదైనా బహుమతిని రద్దు చేసే హక్కు మాకు ఉంది.
మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మా నిబంధనలు మీరు అంగీకరించినట్లయితే మా అన్ని సేవల్లోనూ అవి మీకు వర్తిస్తాయని అర్థం. మరింత సమాచారం కోసం గోప్యతా విధానాన్ని చదవండి.
యూజర్ అకౌంట్ ధ్రువీకరణ మరియు వ్యక్తిగత సమాచార ధృవీకరణ:
రమ్మీకల్చర్ ఎప్పటికప్పుడు దాని గేమ్ ప్లేయర్ యూజర్ అకౌంట్లను ధృవీకరించడానికి ప్రయత్నించవచ్చు. ఈ ప్రయత్నాలు ఫోన్ కాల్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా చేయవచ్చు. మేము మీతో మొదటిసారి సంప్రదించలేక పోయిన సందర్భంలో, మీతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మేము అదనపు ప్రయత్నాలు చేస్తాము. మీరు అందించిన ఫోన్ నెంబర్, ఇమెయిల్ సరైనది కాకపోతే, మేము మీతో సంబంధాన్ని ఏర్పరచుకోలేక పోవడం వల్ల సేవలకు అంతరాయం ఏర్పడడానికి మేము ఎటువంటి బాధ్యత వహించము.
మేము మిమ్మల్ని చేరుకోలేకపోతే లేదా ధృవీకరణ విజయవంతం కాకపోతే, వెబ్సైట్లోకి లాగిన్ అవ్వకుండా మిమ్మల్ని అనుమతించని హక్కును లేదా మీ గేమ్ పరిమితులను తగ్గించడానికి/లేదా మీ యూజర్ అకౌంట్‌ను మేము సంతృప్తికరంగా ధృవీకరించే వరకు క్యాష్ పరిమితులను జోడించే హక్కు మాకు ఉంది. అటువంటి సంఘటనలలో యూజర్ అకౌంట్ ధృవీకరణకు సంబంధించిన తదుపరి స్టెప్లను మీకు తెలియజేయడానికి మేము మీకు ఇమెయిల్ పంపుతాము. మేము ఎప్పటికప్పుడు గుర్తింపు రుజువు, చిరునామా రుజువు కోసం కూడా మిమ్మల్ని అడగవచ్చు.
తగిన డాక్యుమెంట్స్ అందిన తర్వాత, మీ యూజర్ అకౌంట్‌ను త్వరగా ప్రారంభించడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాము. అయితే, మీ యూజర్ అకౌంట్‌ను తిరిగి రీఇన్‌స్టేట్ చేయడానికి కొన్ని పని దినాలు తీసుకోవచ్చు.
ఒకవేళ మిమ్మల్ని సంప్రదించడానికి అనేక ప్రయత్నాలు చేసినా, అలా చేయలేకపోతే, మీ యూజర్ అకౌంట్‌ను శాశ్వతంగా నిలిపివేసే హక్కుని కూడా మేము కలిగి ఉన్నాము. మీ యూజర్ అకౌంట్లో ఏదైనా ఉంటే, ఆ అమౌంట్‌ని మీ యూజర్ అకౌంట్లో ఫైనాన్షియల్ ఇన్స్ట్రమెంట్కి తిరిగి రిఫండ్ పేమెంట్ చేయడం లేదా మీరు అందించిన చిరునామాకు చెక్ ద్వారా పే చేయడం ద్వారా జరుగుతుంది. ఒకవేళ మీరు అందించిన చిరునామా తప్పుగా ఉంటే, రమ్మీకల్చర్ చెక్ డెలివరీ కోసం అదనపు ప్రయత్నాలు చేయదు, మీరు సరైన చిరునామాను అందించకపోతే రమ్మీకల్చర్ సూచించిన రీడెలివరీ కోసం ఛార్జీలు మీరు చెల్లించాల్సి ఉంటుంది.
మా వెబ్సైట్ గోప్యతా విధానం నిబంధనల్లో ఒక భాగం. అనాథరైజ్డ్ వ్యాప్తి నుంచి రక్షణ అవసరమయ్యే అన్ని రకాల వ్యక్తిగత సమాచారం వెబ్సైట్ గోప్యతా విధానంలో అందించిన పద్ధతిలో వ్యవహరించబడుతుంది.
వినియోగదారు పరిమితులు:
యాంటీ-చీటింగ్, యాంటీ-కొల్యూజన్:
మీరు రిజిస్టర్ చేసుకున్న/చేరిన అన్ని గేమ్స్‌లోనూ మీరే ఆడతారనీ, ఆడడానికి బయటివాళ్ల సహాయం ఉపయోగించకుండా ఉంటాననీ బాధ్యత పడుతున్నారు. మీరు అనధికార భాగాలను జోడించకూడదు, మోసకారి విధానాల్ని క్రియేట్ చేయడం, ఉపయోగించడం కుదరదు, దోపిడీలు, బాట్స్, హ్యాక్స్ లేదా వెబ్‌సైట్‌ని సవరించడానికి లేదా ఇతర మూడవ పార్టీ సాఫ్ట్వేర్లను క్రియేట్ చేయడం లేదా ఉపయోగించడం లేదా వెబ్సైట్ నుంచి లేదా వెబ్సైట్ ద్వారా లేదా సమాచారాన్ని సేకరించే మూడవ పార్టీ సాఫ్ట్‌వేర్‌ని ఏవైనా సేవల ద్వారా ఉపయోగించకూడదు. అటువంటి బాహ్య సహాయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ఖచ్చితంగా నిషేధించబడింది.
వెబ్సైట్లో నిర్వహించిన గేమ్స్‌లో పాల్గొనడానికి మీకు ఏ ఇతర యూజర్ (ల) మధ్యనైనా టీమ్స్ ఏర్పాటు మరియు రహస్యంగా కుమ్మక్కు కావడం లేదా ఇతర రకాల మోసం ఖచ్చితంగా నిషేధించబడింది.
మనీ లాండరింగ్:
వెబ్సైట్లో పరిమితి లేకుండా, క్రెడిట్ కార్డ్స్ ద్వారా జోడించిన వినియోగించని క్యాష్ నుంచి క్యాష్‌ను విత్‌డ్రా చేసుకోవటానికి ప్రయత్నించడం లేదా ఉద్దేశపూర్వకంగా ఒక నిర్దిష్ట ప్లేయర్(ల) కి డబ్బు పోగొట్టడంతో సహా, మనీలాండరింగ్ వలె భావించబడే ఏదైనా యాక్టివిటీ చేయకుండా మీరు నిషేధించబడ్డారు.
యాంటీ-స్పామింగ్
రమ్మీకల్చర్ ఏదైనా ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ నుంచి లేదా మరే ఇతర ప్రయోజనాల కోసమైనా లబ్ధి పొందటానికి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ పొందడం గానీ, స్పామ్ ఇ-మెయిల్స్‌ని లేదా ఇతర అవాంఛనీయ సమాచార మార్పిడిని పంపడం గానీ ఖచ్చితంగా నిషేధించబడింది.
మల్టిపుల్ ID లు
వెబ్సైట్లో మీ రిజిస్ట్రేషన్ ఒక సింగిల్ యూజర్ అకౌంట్‌కు పరిమితం చేయబడింది, ఇది వెబ్సైట్లో అందించిన సేవలను పొందటానికి మీకు ఉపయోగించబడుతుంది. వెబ్సైట్లో రిజిస్టర్ చేయడానికి మల్టిపుల్ వినియోగదారు ఐడిలను క్రియేట్ చేయడం లేదా ఉపయోగించడం మీకు నిషేధించబడింది.
మీరు లాగిన్ పేరు లేదా పాస్‌వర్డ్‌ని క్రియేట్ చేయలేరు లేదా వెబ్సైట్ ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా అందించబడిన ఏదైనా మెసేజింగ్ సదుపాయంతో సహా ఏదైనా సేవ లేదా సౌకర్యం ద్వారా కంటెంట్‌ను అప్లోడ్ చేయడం, పంపిణీ చేయడం, ప్రసారం చేయడం, ప్రచురించడం లేదా పోస్ట్ చేయడం వంటివి చేయకూడదు. అలా చేయడం:
అవమానకరం, పరువు నష్టం కలిగించడం, అశ్లీలం, భయపెట్టడం, గోప్యతపై దాడి చేయడం, దుర్వినియోగం చేయడం, చట్టవిరుద్ధం, వేధించడం;
ద్వేషపూరితమైన భావాల్ని తెలియపరచడం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, జాతి వివక్ష లేదా అశ్లీలత;
(చట్టవిరుద్ధం కాకపోయినా) అభ్యంతరకం లేదా అవాంఛనీయం;
క్రిమినల్ నేరానికి ప్రేరేపించడం;
ఏ వ్యక్తి హక్కులనైనా ఉల్లంఘించడం;
విరాళాలు లేదా ఇతర రకాల సహాయాన్ని కోరడం లక్ష్యంగా కలిగి ఉండడం;
ఏదైనా వ్యక్తి మేధో సంపత్తిని ఉల్లంఘించడం;
రమ్మీకల్చర్ లేదా దాని సబ్సిసడరీ సంస్థలు, అనుబంధ సంస్థలు, లైసెన్సర్లు, అసోసియేట్లు, భాగస్వాములు, స్పాన్సర్లు, ప్రొడక్ట్స్, సేవలు లేదా వెబ్సైట్లని చులకన చేయడం;
పోటీ సేవ లేదా ప్రొడక్ట్‌ని ప్రోత్సహించడం; లేదా
ఏదైనా చట్టలను ఉల్లంఘించడం.
ఒకవేళ మీరు క్రియేట్ చేసిన లాగిన్ పేరు అసభ్యకరమైనది, అభ్యంతరకరమైనది, అప్రియమైనది లేదా అవాంఛనీయమైనదని మేము నిర్ధారిస్తే, మేము దాని గురించి మీకు తెలియజేస్తాము. మీరు వెంటనే మాకు ఆల్టర్నేట్ లాగిన్ పేరును అందించాలి, తద్వారా మీ ప్రస్తుత లాగిన్ పేరును మీరు అందించే క్రొత్త పేరుతో మేము మార్చగలము. మీరు ఆల్టర్నేట్ నేమ్ అందించడంలో విఫలమైతే, మీ యూజర్ అకౌంట్‌ను శాశ్వతంగా నిలిపివేయడానికి లేదా మీరు వేరే ఆమోదయోగ్యమైన లాగిన్ పేరు అందించిన తర్వాత మాత్రమే మీ యూజర్ అకౌంట్‌ను పునరుద్ధరించే హక్కు మాకు ఉంది.
ప్రోటోకాల్ ఎమ్యులేషన్, రివర్స్ ఇంజనీరింగ్ లేదా వెబ్సైట్ మోడిఫికేషన్ లేదా వెబ్సైట్లో భాగమైన ఏవైనా ఫైల్స్‌తో సహా, ఉపయోగించిన పద్ధతులతో సంబంధం లేకుండా, వెబ్సైట్ ఉపయోగించే యాజమాన్య కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్‌ని మీరు హోస్ట్ చేయకూడదు, అడ్డుకోకూడదు, మళ్ళించకూడదు.
మీరు వెబ్‌సైట్‌ను ఫ్రేమ్ చేయకూడదు. మీరు వెబ్సైట్లో సంపాదకీయ వ్యాఖ్యలు, వాణిజ్యపరమైన మెటీరియల్ లేదా ఏదైనా సమాచారాన్ని ఇంపోజ్ చేయకూడదు, వెబ్‌సైట్‌లోని కంటెంట్‌ను మార్చడం లేదా సవరించడం కుదరదు లేదా ఏదైనా యాజమాన్య నోటీసులు లేదా లేబుల్‌లను తొలగించడం, నాశనం చేయడం, ఆటంకపరచడం వంటివి చేయకూడదు.
మీరు కంప్యూటర్ గేమింగ్ కేంద్రంగా సైబర్ కేఫ్‌లో ఉపయోగించడం, ఇంటర్నెట్ ద్వారా నెట్వర్క్ ప్లే చేయడం లేదా గేమింగ్ నెట్వర్క్స్ ద్వారా లేదా వెబ్సైట్లో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని కాపీ చేసే అనధికార సెర్వర్కి కనెక్షన్ ఇవ్వడం వంటి వాటితో సహా, వాటికే పరిమితం కాకుండా వెబ్సైట్లో సేవలను ఉపయోగించకూడదు.
వైరస్లు లేదా కంప్యూటర్ కలుషితాలు (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 లో నిర్వచించినట్లుగా లేదా సంబంధిత సమయంలో భారతదేశంలో అమలులో ఉన్న ఇతర చట్టాలు) కలిగి ఉన్న ఏదైనా కంటెంట్‌ను మీరు వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయకూడదు, పంపిణీ చేయకూడదు లేదా ప్రచురించకూడదు. రమ్మీకల్చర్ అందించే సేవలను అందించడంలో మాకు సహాయపడే ఏదైనా సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ లేదా ఇతర పరికరాల యాక్టివిటీకి లేదా అంతరాయం కలిగించకూడదు. వెబ్‌సైట్‌కు హానికరమా కాదా అనే దానితో నిమిత్తం లేకుండా మీరు వైరస్లు, ప్రోగ్రామ్స్ లేదా సాఫ్ట్వేర్లను డిస్ట్రిబ్యూట్ చేయకూడదు లేదా అప్లోడ్ చేయకూడదు. అదనంగా, మీరు మరొక వ్యక్తి లేదా వినియోగదారు వలె నటించకూడదు, పాస్వర్డ్, ఇంకా ఇతర యూజర్ అకౌంట్ సమాచారం లేదా ఒక వినియోగదారు నుంచి ఇతర ప్రైవేట్ సమాచారాన్ని పొందటానికి ప్రయత్నించకూడదు లేదా ఇమెయిల్ చిరునామాలు లేదా ఇతర సమాచారాన్ని సేకరించకూడదు.
మీరు వెబ్సైట్ నుంచి ఉత్పన్నమయ్యే లేదా అసోసియేట్ అయి ఉన్న మీ యూజర్ అకౌంట్, కంటెంట్, కరెన్సీ, పాయింట్స్, స్టాండింగ్‌లు, ర్యాంకింగ్స్, రేటింగ్‌లు లేదా కనిపించే ఇతర అట్రిబ్యూట్స్ని కొనుగోలు చేయకూడదు, అమ్మకూడదు, వ్యాపారం చేయకూడదు, అద్దెకివ్వకూడదు, లైసెన్స్ ఇవ్వకూడదు లేదా బదిలీ చేయకూడదు.
మీ యూజర్ అకౌంట్‌కు క్యాష్ జోడించడానికి ఇతర వ్యక్తి క్రెడిట్ కార్డ్స్ (లు), డెబిట్ కార్డ్ నెట్-బ్యాంకింగ్ వినియోగదారు పేరు, పాస్వర్డ్, ఆథరైజేషన్ కోడ్స్, ప్రీపెయిడ్క్యాష్ కార్డ్స్, మొబైల్ ఫోన్లతో సహా ఏదైనా మోసపూరితమైన చర్య ఖచ్చితంగా నిషేధించబడింది.
వేరొకరి యూజర్ అకౌంట్ ద్వారా సేవలను యాక్సెస్ చేయడం లేదా యాక్సెస్ చేయడానికి ప్రయత్నించడం ఖచ్చితంగా నిషేధించబడింది.
విన్నింగ్స్, బోనస్‌లు, బహుమతులు ప్లేయర్‌కి మాత్రమే ఉద్దేశించబడినవి, ఇవి బదిలీ చేయబడవు. మీరు ఏదైనా విన్నింగ్స్, బోనస్‌లు లేదా బహుమతులను బదిలీ చేయడానికి ప్రయత్నించినట్లయితే, ఇవి జప్తు చేయబడతాయి.
రమ్మీకల్చర్తో మీరు ఎంగేజ్ అయి ఉన్న సమయం కాకపోతే తప్ప మీరు రమ్మీకల్చర్ అధికారి, డైరెక్టర్, ఉద్యోగి, కన్సల్టెంట్ లేదా ఏజెంట్ లేదా అలాంటి వ్యక్తుల బంధువు (“అసోసియేటెడ్ పర్సన్”) అయితే, వెబ్సైట్లో ఏదైనా బహుమతికి మీకు అర్హత ఉన్న ఏ గేమ్స్‌ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆడడానికి మీకు అనుమతి లేదు. ఈ ప్రయోజనాల కోసం, ‘బంధువు’ అనే పదంలో జీవిత భాగస్వామి, ఆర్థికగా ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లలు ఉంటారు.
మా ఏకైక అభిప్రాయం ప్రకారం, మీరు పోస్ట్ చేసిన ఏదైనా విషయం లేదా వ్యాఖ్యలు మా వ్యాపార ప్రయోజనాలకు నష్టం కలిగించేవిగానూ లేదా హానికరమైనవిగానూ భావించబడినపుడు, మా స్వంత విచక్షణాధికారంలో, పబ్లిక్ యాక్సెస్ కోసం అందుబాటులో ఉన్న ఏ మాధ్యమంలోనైనా మీరు మా వ్యాపార ప్రయోజనాలకు పరువు నష్టం కలిగించే లేదా హాని కలిగించే ఏదైనా మెటీరియల్‌ని లేదా వ్యాఖ్యనీ పోస్ట్ చేయకూడదు. అయినప్పటికీ, అలాంటి మీడియా మా స్వంతం కాదు లేదా మా ద్వారా నియంత్రించబడదు. దీని నిబంధనలకు అనుగుణంగా మేము తీసుకునే ఇతర చర్యలతో పాటు, మీరు పోస్ట్ చేసిన ఏవైనా లేదా అన్ని విషయాలనూ లేదా వ్యాఖ్యలను తొలగించే హక్కు మాకు ఉంది. మాచే నియంత్రించబడే లేదా మితంగా పబ్లిక్ యాక్సెస్ కోసం అందుబాటులో ఉన్న ఏదైనా మీడియాకు మీ యాక్సెస్‌ని పరిమితం చేయడం జరుగుతుంది.
ట్రాన్జాక్షన్లు & చెల్లింపులు:
వెబ్‌సైట్‌లోని అన్ని ట్రాన్జాక్షన్లు భారతీయ రూపాయిల్లో ఉండాలి.
మీరు మా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ అన్ని ట్రాన్జాక్షన్ల రికార్డ్స్‌ని మాతో ఉంచడానికి మేము మీ కోసం యూజర్ అకౌంట్‌ను నిర్వహిస్తాము. క్యాష్ గేమ్స్‌లో పాల్గొనడంతో కనెక్ట్ చేయబడిన పేమెంట్స్ మీ రమ్మీకల్చర్ యూజర్ అకౌంట్ ద్వారా చేయాలి. మీరు గెలుచుకున్న అన్ని క్యాష్ బహుమతులు ఈ యూజర్ అకౌంట్లోకి జమ చేయబడతాయి.
పేమెంట్ చేసేటప్పుడు, దయచేసి పేమెంట్ చేయడానికి ఉపయోగించే డివైస్ మీ స్వంతానిదై ఉండేలా చూసుకోండి. మీ యూజర్ అకౌంట్లోకి క్యాష్‌ను జోడించడానికి మాత్రమే ఉపయోగించబడేదై ఉండాలి.
ఎప్పటికప్పుడు మేము పేర్కొన్న క్యాష్ పరిమితులను జోడించి, వెబ్సైట్లో క్యాష్ గేమ్స్‌లో పాల్గొనే ఉద్దేశ్యంతో మీ యూజర్ అకౌంట్లో మీకు కావలసినంత డబ్బు జమ చేయడానికి మీకు స్వేచ్ఛ ఉంది.
రమ్మీకల్చర్ మీరు వెబ్సైట్లో బాధ్యతాయుతంగా ఆడాలని కోరుకుంటుంది. మీ యూజర్ అకౌంట్లో క్యాష్‌ను జోడించే సామర్థ్యం నెలవారీ యాడ్ క్యాష్ పరిమితులకు లోబడి ఉంటుంది. ఇది సంస్థలు, నష్టపరిహారం, రుణ మాఫీ, ధృవీకరణ పరిస్థితులతో మా స్వంత విచక్షణాధికారం ప్రకారం మేము తగినదిగా భావించిన విషయాల్ని సెట్ చేయవచ్చు.
క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ప్రీపెయిడ్ క్యాష్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పేమెంట్స్ థర్డ్ పార్టీ చెల్లింపు గేట్‌వేల ద్వారా ప్రాసెస్ చేయబడతాయి. అదేవిధంగా, ఇతర చెల్లింపు మోడ్స్‌కి కూడా పేమెంట్స్‌ని ప్రాసెస్ చేసే మధ్యవర్తిత్వ సంస్థల అధికారం అవసరం. వాళ్ల వైపు నుంచి జరిగే ఆలస్యం లేదా తిరస్కరణలకు మేము బాధ్యత వహించము. పేమెంట్స్ ప్రాసెసింగ్ వారి పాలసీలు, ప్రొసీజర్స్ పరంగా మాత్రమే ఉంటుంది తప్ప మా వైపు నుంచి ఎలాంటి బాధ్యత గానీ లేదా రిస్క్ గానీ వహించము. క్యాష్ జోడించడానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే, దిగువ “ఫిర్యాదులు మరియు వివాదాలు” విభాగంలో అందించిన ఫిర్యాదుల ప్రొసీజర్ని అనుసరించి ఫిర్యాదు మాకు పంపబడుతుంది. మీ క్రెడిట్ మా నియంత్రణకు మించిన కారణాల వల్ల ఆలస్యమైన లేదా చివరికి తిరస్కరించబడిన సందర్భంలో మేము ఏ విధంగానైనా బాధ్యతా వహించము. చెల్లింపు/ట్రాన్జాక్షన్కి అధికారం పొందిన తర్వాత, ఫండ్స్ మీ యూజర్ అకౌంట్‌కు జమ చేయబడతాయి, మీకు క్యాష్ గేమ్స్‌ని ఆడడానికి అందుబాటులో ఉంటాయి.
పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే, కేవలం మా విచక్షణాధికారాన్ని అనుసరించి ఒక ట్రాన్జాక్షన్ని మేము ఎప్పుడైనా కేన్సిల్ చేయడానికి అధికారం కలిగి ఉన్నాం అప్పుడు ట్రాన్జాక్షన్ రివర్స్ చేయబడుతుంది, మీ పేమెంట్ ఇన్స్ట్రమెంట్కి తిరిగి క్రెడిట్ చేయబడుతుంది.
నిర్దిష్ట బ్యాంక్ అకౌంట్స్‌లో ప్లేయర్ ఫండ్స్ మా వద్ద అత్యంత విశ్వసనీయంగా ఉంచబడతాయి. రమ్మీకల్చర్ అన్ని గేమ్ ప్లేయర్ ఫండ్స్‌ని ఎలాంటి అసౌకర్యమూ లేని ఫండ్స్‌లో ఉంచుతుంది, ఇది ఫండ్స్ విత్‌డ్రాయల్‌కు వర్తించే నిబంధనలు, షరతులకు లోబడి మీకు తగిన సమయంలో పంపబడుతుంది. మీ యూజర్ అకౌంట్లో ఉన్న ఫండ్స్ మా కార్పొరేట్ ఫండ్స్ నుంచి వేరుగా ఉంటాయి. ఎలాంటి పరిస్థితిలోనూ దివాలా ప్రొసీడింగ్కి అవకాశం ఉండదు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే, డిపాజిట్స్‌పై మీరు చేసే క్లెయిమ్స్‌కు చట్టబద్ధమైన అనుమతించబడే మేరకు మిగతా అన్ని క్లెయిమ్స్ కంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
విత్‌డ్రాయల్స్:
మీరు మీ విన్నింగ్స్ని ఒక ఎలక్ట్రానిక్ బ్యాంక్ నుంచి బ్యాంకు బదిలీ ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు.
మీరు చేసే అన్ని విత్‌డ్రాయల్‌లు ఈ క్రింది షరతుల ద్వారా నిర్వహించబడుతున్నాయని మీరు అంగీకరిస్తున్నారు:
ఏ దశలోనైనా మీ చిరునామానీ, గుర్తింపునీ ధృవీకరించడానికి రమ్మీకల్చర్ మిమ్మల్ని KYC డాక్యుమెంట్స్‌ని అడగవచ్చు. అటువంటి KYC ప్రక్రియ పూర్తయిన అకౌంట్ల నుంచి మాత్రమే విత్‌డ్రాయల్‌లు అనుమతించబడతాయి.
డబ్బు విత్‌డ్రాయల్ పరిమితులకు లోబడి మీ విత్‌డ్రాయల్ అభ్యర్థనను మాకు తెలియజేయడం ద్వారా బోనస్/బహుమతి మీరు ఎప్పుడైనా మీ యూజర్ అకౌంట్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. బోనస్‌లు, ప్రమోషనల్ విన్నింగ్స్ విత్‌డ్రాయల్ పరిమితులకు లోబడి ఉంటాయి. మీరు www.RummyCulture.comలో కనీసం ఒక క్యాష్ డిపాజిట్ చేసి, ఆ తర్వాత కనీసం ఒక క్యాష్ గేమ్ ఆడిన తర్వాత మాత్రమే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
నోటిఫై చేసిన తర్వాత, విత్‌డ్రాయల్ అభ్యర్థనని ధృవీకరించిన తర్వాత మేము ఆ నిర్దిష్ట మొత్తాన్ని ఎలక్ట్రానిక్ ద్వారా పంపిణీ చేయవచ్చు. మీ యూజర్ అకౌంట్‌కు క్యాష్‌ని జోడించడానికి ఉపయోగించే ఫైనాన్షియల్ ఇన్స్ట్రమెంట్లో మొత్తాన్ని పంపిణీ చేసే హక్కును కూడా మేము కలిగి ఉన్నాము.
ఇప్పుడు వర్తించే విధానం ప్రకారం విత్‌డ్రాయల్స్ మీద ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవు.
మీ విత్డ్రాయల్లను సకాలంలో ప్రాసెస్ చేయడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాము, కాని ధృవీకరణ విత్‌డ్రాయల్ ట్రాన్జాక్షన్ని పూర్తి చేయడానికి అవసరమైన సమయం కారణంగా ఆలస్యం కావచ్చు. మీ యూజర్ అకౌంట్ నుంచి మీకు పేమెంట్స్‌ని పంపించడంలో ఆలస్యం జరిగినందుకు మీకు ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత మాకు ఉండదు.
బహుమతి/బోనస్‌ని గెలవడానికి అర్హత పొందడానికి, మీరు భారతదేశ నివాసి అయి ఉండాలి, భారతదేశం నుంచి వెబ్సైట్లో రమ్మీకల్చర్ సేవలను యాక్సెస్ చేయాలి.
రమ్మీకల్చర్ సేవలను యాక్సెస్ చేసేటప్పుడు మీరు బహుమతి విజేత అయి ఉండి, భారతదేశంలో భౌతికంగా ఉండి, భారతదేశ నివాసి అయి ఉండి, మీరు భారతీయ పౌరుడు కాకపోతే, మీరిచ్చిన బ్యాంక్ అకౌంట్ భారతదేశంలోనే ఉండి ఉంటే, మేము మీకు ఇచ్చిన బ్యాంకు అకౌంట్‌కు భారతీయ రూపాయిల్లో మీ విన్నింగ్స్ని చెల్లిస్తాము,
సర్వీస్ కనెక్టివిటీ సమస్యలు:
ఏదైనా ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు, మీ స్థానిక ఇంటర్నెట్ వాతావరణం వల్ల కలిగే అంతరాయాలు, మీ చివర సాఫ్ట్వేర్ లేదా హార్డ్‌వేర్‌ని సెటప్ చేయడం రమ్మీకల్చర్ ద్వారా నియంత్రించబడదు/సరిదిద్దబడదని మీకు తెలుసు. అందువల్ల, మా సేవలను మీరు ఉపయోగించడంలో ఎటువంటి ఆటంకాలు, బ్రేక్స్ లేదా అంతరాయాలకు వెబ్సైట్ బాధ్యత వహించదు.
యూజర్ అకౌంట్ సస్పెన్షన్ వాలంటరీ టెర్మినేషన్:
మీరు మా వెబ్సైట్ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే లేదా మా వెబ్సైట్ భద్రతను ఉల్లంఘించినట్టు మేము కనుగొంటే, మీ అకౌంట్‌ను మా వద్ద నిలిపివేయడానికి లేదా క్లోజ్ చేయగల మాకు హక్కు ఉంది. మీ సేవలను నిలిపివేయడానికి లేదా ముగించడానికి మా నిర్ణయం మీపైనా, ఇది మా స్వంత విచక్షణాధికారం మీదా ఆధారపడి ఉందని మీరు అర్థం చేసుకున్నారు.
అవసరమైతే, @ support@rummyculture.com కి మమ్మల్ని సంప్రదించడం ద్వారా మీరు ఎప్పుడైనా మా సేవలను ఉపయోగించడం మానుకోవచ్చు . అలాంటి సందర్భంలో, మా వెరిఫికేషన్ తర్వాత విశ్లేషించబడిన మీ విత్‌డ్రా చేసుకోగల క్యాష్ బ్యాలెన్స్ చెక్ లేదా ఆన్లైన్ బదిలీ ద్వారా మీకు బదిలీ చేయబడుతుంది.
ఉల్లంఘన మరియు పరిణామాలు:
అంతర్గత దర్యాప్తును అనుసరించి, ఎవరైనా మా భద్రత గోప్యతా ప్రోటోకాల్స్‌ని ఉల్లంఘించినట్లు మేము కనుగొంటే, కనుగొనబడిన ఉల్లంఘన తీవ్రతను బట్టి, మేము అనేక రకాల చర్యలను చేపట్టాలని నిర్ణయించుకోవచ్చు. ఈ క్రింది చర్యలలో ఒకటి గానీ లేదా అంతకంటే ఎక్కువ గానీ చర్యలు తీసుకునేందుకు ఏకైక హక్కు మాకు ఉంది:
మేము యూజర్ అకౌంట్లో సేవలను నిరవధికంగా ఆపవచ్చు.
మేము మా వెబ్సైట్లో యూజర్ అకౌంట్‌ను శాశ్వతంగా ముగించవచ్చు.
మేము మీ అకౌంట్లో క్యాష్ విత్‌డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా చేయవచ్చు.
ఉల్లంఘన కారణంగా సంభవించిన నష్టాలకు పరిహారం కోరవచ్చు అవసరమైతే, అభ్యంతరకర ఉల్లంఘనలకు, ఇప్పుడున్న చట్టానికి విరుద్ధంగా జరిగిన ఉల్లంఘనలకు వినియోగదారుని విచారించవచ్చు.
భవిష్యత్తులో మా వెబ్సైట్లో రిజిస్టర్ చేయకుండా మేము మిమ్మల్ని నిరోధించవచ్చు.
ఫిర్యాదులు మరియు వివాదాలు:
ఫిర్యాదు గల వినియోగదారు support@rummyculture.com కి వ్రాయడం ద్వారా మా కస్టమర్ కేర్ టీమ్‌ని పరిష్కారం కోసం సంప్రదించవచ్చు. రమ్మీకల్చర్ వద్ద ఉన్న అన్ని ఫిర్యాదులు, వివాదాలను గోప్యంగా ఉంచాలని ఫిర్యాదు చేస్తున్న వినియోగదారు అర్థం చేసుకోవాలి. ఫిర్యాదులను ప్రామాణిక సమయంలో పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తాము. ఫిర్యాదు చేసిన తర్వాత, రమ్మీకల్చర్ తీసుకున్న ఏ నిర్ణయానికైనా వినియోగదారు కట్టుబడి ఉండాలి. కంపెనీపై ఏదైనా ఫిర్యాదు, వివాదానికి సంబంధించిన విషయం బెంగుళూరులోని సివిల్ కోర్టుల ప్రత్యేక అధికార పరిధికి లోబడి ఉంటుంది.
కంటెంట్ & ప్రమోషన్లు:
వెబ్‌లో ఉండే మొత్తం కంటెంట్, మెటీరియల్ సమాచారం, చిత్రాలు, మార్క్స్, లోగోలు, డిజైన్లు, బొమ్మలు, గ్రాఫిక్స్, టెక్స్ట్ కంటెంట్, హైపర్ లింక్స్, మల్టీమీడియా క్లిప్‌లు, యానిమేషన్, గేమ్స్ సాఫ్ట్వేర్ (అన్నింటినీ కలిపి “కంటెంట్” గా సూచించబడుతుంది) తో సహా, వీటికే పరిమితం కాకుండా, రమ్మీకల్చర్కి చెందినవైనా, కాకపోయినా, వర్తించే మేధో సంపత్తి చట్టల ద్వారా రక్షించబడతాయి. అదనంగా, ఏ యూజర్ ద్వారా నైనా ద్వారా పంపబడిన చాట్ కంటెంట్, సందేశాలు, చిత్రాలు, సిఫార్సులు, ఇమెయిళ్ళు, చిత్రాలు మా ద్వారా లాగిన్ చేయబడతాయి/రికార్డ్ చేయబడతాయి. అదంతా కంటెంట్ లో భాగంగా ఉంటుంది, రమ్మీకల్చర్ ఈ విషయాన్ని ఏ విధంగానైనా ఉపయోగించడానికి స్వేచ్ఛని కలిగి ఉంటుంది, ఏదైమైనప్పటికీ, ఇది ఏ విధంగానైనా వినియోగదారు ప్రయోజనాలకి హానికరం కాదు.
*‘భారతదేశంలో అత్యంత విశ్వసనీయ రమ్మీ సైట్’ పూర్తిగా దాని వినియోగదారుల సమీక్షలు, అంగీకారాలు & సెల్ఫ్ అసెస్మెంట్స్పై ఆధారపడి ఉంటుంది. వీటిని రుజువు చేసే డాక్యుమెంట్స్ తగిన అధికారం ద్వారా డిమాండ్ చేసినపుడు మాత్రమే ప్రొడ్యూస్ చేయబడతాయి.
వెబ్సైట్లో నిర్వహించిన వివిధ ప్రమోషన్లు/క్లబ్‌లు/టోర్నమెంట్ వివరాలను వెబ్సైట్లో చూడవచ్చు. కొనసాగుతున్న ప్రమోషనల్ కార్యక్రమాలకు అర్హత, వర్తించే షరతులు వెబ్సైట్లో అందించబడ్డాయి, ఇవి నిబంధనలలో భాగంగా ఉన్నాయి. ముందస్తు నోటీసు లేకుండా రద్దు లేదా సవరించే హక్కును మరింత రమ్మీకల్చర్ కలిగి ఉంది.
గేమ్ నియమాలు:
ప్రతి గేమ్‌కి సంబంధించిన నియమ నిబంధనలకు కట్టుబడి ఉండడానికి మీరు అంగీకరిస్తున్నారు. మీరు గేమ్స్ నియమ నిబంధనలను చదివి అర్థం చేసుకున్నారని నిర్థారించుకోవాలి. ఈ గేమ్ నియమాలు ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. వీటిని సైట్‌లోని ‘గేమ్ నియమాలు/ఎలా ఆడాలి’ అనే పేజీలో చూడవచ్చు. మేము ఎప్పటికప్పుడు, సేవల్లో భాగంగా అదనపు గేమ్స్‌ని అందుబాటులో ఉంచుతాము. ఈ అగ్రిమెంట్ అలాంటి గేమ్స్‌కి సంబంధించిన ఏ గేమ్ నిబంధనలకైనా వర్తిస్తుంది. సైట్‌కు అదనపు గేమ్స్‌ని పరిచయం చేసే సమయంలో ఇటువంటి గేమ్ రూల్స్ గురించి మేము మీకు తెలియజేస్తాము, అలాగే చదవడానికి మీకు అవకాశం ఇస్తాము. గేమ్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి గేమ్ ఫలితాలు, విజేతలను నిర్ణయించే హక్కు మాకు ఉంది. ఏదైనా గేమ్ లేదా టోర్నమెంట్లో రిజిస్టర్ చేయడం/లేదా పాల్గొనడం ద్వారా మీరు ఈ నిర్ణయాలను అంగీకరిస్తారు, సవాలు చేయడానికి సిద్ధపడరు. మేము ప్రతి గేమ్/టోర్నమెంట్‌ను అనుసరించి సైట్లో విజేతల జాబితాలను పోస్ట్ చేస్తాము.
నిరాకరణ & నష్టపరిహారం & బాధ్యత పరిమితి:
మీ ఉపయోగానికి సంబంధించి సేవలు, సైట్ లేదా ప్లాట్‌ఫారమ్ నుంచి లేదా వాటికి సంబంధించి ఉత్పన్నమయ్యే ఏదైనా దావా, నష్టం, గాయం లేదా నష్టాలకు (ప్రత్యక్ష, పరోక్ష, యాదృచ్ఛిక లేదా మరేదైనా) కంపెనీ “రమ్మీకల్చర్” బాధ్యత వహించదు. ఒప్పందంలో ఏదైనా విరుద్ధంగా ఉన్నప్పటికీ, మీ అకౌంట్స్‌లో ఏదైనా క్యాష్ బ్యాలెన్స్ వాలిడ్ రిడమ్షన్ మినహా అన్ని పరిస్థితులలోనూ మా మీద మీరు చేసిన అన్ని క్లెయిమ్‌లకు మా గరిష్ట మొత్తం బాధ్యత రు. 2,000/- మాత్రమే.
మీ యూజర్ అకౌంట్‌కు క్యాష్‌ను జోడించడానికి లేదా క్యాష్ గేమ్స్‌లో పాల్గొనడానికి ముందు, మీరు క్యాష్ గేమ్స్‌ని యాక్సెస్ చేస్తున్న అధికార పరిధిలో క్యాష్ గేమ్స్‌ని ఆడడానికి సంబంధించిన చట్టబద్ధత గురించి మిమ్మల్ని మీరు సంతృప్తి పరుచుకోవాలి. భారతదేశంలోని బ్యాంకింగ్ ఛానెళ్ల ద్వారా వ్యక్తిగతంగా భారతీయ రూపాయి ట్రాన్జాక్షన్ల్లోకి ప్రవేశించడానికి/లేదా అనుమతించబడిన అధికార పరిధి నుంచి వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయకపోతే, వెబ్సైట్లో క్యాష్ గేమ్స్‌లో పాల్గొనడం మీకు నిషేధించబడింది. అటువంటి ఉల్లంఘన జరిగితే, క్యాష్ గేమ్స్‌లో మీరు పాల్గొనడం నిబంధనలను ఉల్లంఘించినట్టుగా పరిగణించబడుతుంది, అటువంటి క్యాష్ గేమ్స్‌లో మీరు గెలుచుకునే బహుమతిని స్వీకరించడానికి మీకు అర్హత ఉండదు.
యాక్టివిటీ పాల్గొనడానికి మీకు అవసరమైన అనుభవమూ, నైపుణ్యాలూ ఉన్నాయనీ, యాక్టివిటీ పూర్తిగా పాల్గొనే మీ సామర్థ్యాన్ని దెబ్బతీసే శారీరక లేదా మానసిక స్థితి గురించి మీకు తెలియదని మీరు సూచిస్తున్నారు. మీరు ఈ యాక్టివిటీ పాల్గొనడం లేదా ఈ యాక్టివిటీతో లేదా ఈ యాక్టివిటీకి సంబంధించిన సంబంధం కలిగి ఉండడం వలన కలిగే ఏదైనా పరిణామానికి మీరు మాత్రమే బాధ్యత వహిస్తారని మీరు అంగీకరిస్తున్నారు. యాక్టివిటీ పాల్గొనడం వలన మీరు కొనసాగించే ఏదైనా ఆర్థిక నష్టానికి రమ్మీకల్చర్కి ఎటువంటి బాధ్యత లేదా బాధ్యత వహించదని మీరు అర్థం చేసుకున్నారు.
రమ్మీకల్చర్ ద్వారా నిర్వహించబడే మీ యూజర్ అకౌంట్లోని ఫండ్స్ వడ్డీని గానీ లేదా రాబడిని గానీ కలిగి ఉండవని మీరు అర్థం చేసుకున్నారు.
మీరు పాల్గొనడానికి అర్హత ఉన్న ఏ గేమ్‌నైనా ఆడలేకపోతున్నందుకు మీరు రమ్మీకల్చర్ని బాధ్యత వహించేలా చేయకూడదు. ఇది మీ యూజర్ అకౌంట్ ధృవీకరణ పెండింగ్‌లో ఉండడం వల్ల మీరు మీ యూజర్ అకౌంట్లోకి లాగిన్ అవ్వలేని పరిస్థితులు ఉండవచ్చు, ఇది అంతవరకే పరిమితం కాక మీరు ఏదైనా నిబంధనలను ఉల్లంఘించినట్లు అనుమానింపబడినా, లేదా నిరూపించబడినా కూడా అలా జరగవచ్చు.
మీ ఉపయోగానికి సంబంధించి సేవలు, సైట్ లేదా సాఫ్ట్వేర్ లేదా సంబంధించి ఏదైనా సంస్థ లేదా వ్యక్తి మాకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన ఏవైనా దావాలు, చర్యలు, సూట్స్, నష్టాలు, జరిమానాలు లేదా అవార్డులతో కంపెనీకి ఎలాంటి నష్టమూ కలగజేయకుండా చూస్తానని మీరు కంపెనీకి గ్యారెంటీ ఇస్తున్నారు, అంగీకరిస్తున్నారు.
సేవలు, సైట్ లేదా సాఫ్ట్వేర్ మరియు ఏ యూజర్ ద్వారా అయినా మీరు కనెక్ట్ అయ్యే మూడవ పార్టీలతో మీరు పాల్గొనడం, లేదా రద్దు చేయడం, ఏదైనా ఆట, ఏదైనా యాక్టివిటీ లేదా ట్రాన్జాక్షన్లు, అలాంటి యూజర్ – జనరేటెడ్ కంటెంట్‌కు సంబంధించి మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘనతో సహా, వాటి వలన కలిగే ఏదైనా హానికి కంపెనీ అన్ని బాధ్యతలనూ మరియు భారాలనూ స్పష్టంగా నిరాకరిస్తుంది.
మేధో సంపత్తికి సంబంధించిన సేవలు, సైట్, ప్లాట్‌ఫారమ్‌కి సంబంధించిన కాపీరైట్, ఇంకా ఇతర మేధో సంపత్తి హక్కులతో సహా అన్ని హక్కులూ, స్పష్టంగానూ, అస్పష్టంగానూ ఉంటాయి. వాటిలో ప్రదర్శించబడే లేదా కలిగి ఉన్న ఏదైనా కంటెంట్ లేదా సమాచారం, వేరే విధంగా తెలియజేస్తే తప్ప, ప్రత్యేకంగా అది కంపెనీకి చెందినది. కంపెనీ కేవలం ఆన్లైన్లో గేమ్స్‌ని ఆడడానికి వినియోగదారుని అనుమతిస్తోంది. ఇతర వాణిజ్య లాభాల కోసం దానిని ఉపయోగించకూడదు, గేమ్ ఆడడానికి అతన్ని/ఆమెను అనుమతించినందువల్ల వినియోగదారుకి ఈ రకమైన విధంగా ప్రవర్తించే హక్కు లేదు. సేవలు, సైట్ లేదా ప్లాట్‌ఫాంని ఉపయోగించడం వల్ల మీరు యాక్సెస్ చేసే సేవలు, సైట్, లేదా సాఫ్ట్వేర్ లేదా కంటెంట్ లేదా సమాచారం ఏదైనా మేధో సంపత్తికి సంబంధించిన హక్కుల యాజమాన్యం మీకు ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ ఇవ్వబడట్లేదు. క్రియేట్ చేసే ఏదైనా కంటెంట్‌పై కంపెనీ హక్కులను కలిగి ఉంటుంది, వీటిలో చాట్ మెసేజిలు లేదా మెసేజ్ బోర్డులు/ఫోరమ్స్ కంటెంట్స్కే పరిమితం కాకుండా, వాటితో సహా అలాంటి యూజర్- జెనరేటెడ్ కంటెంట్‌కు కంపెనీ బాధ్యత వహించదని మీరు గుర్తించారు. మీరు మీ స్వంత పూచీతో అలాంటి యూజర్- జెనరేటెడ్ కంటెంట్‌ని మీ స్వంత రిస్కు మీద యాక్సెస్ చేస్తారని మీరు అర్థం చేసుకున్నారు, ప్రదర్శించబడే, యాక్సెస్ చేయబడే అశ్లీలమైన, నిందాత్మకమైన, చట్టవిరుద్ధమైన, బాధపెట్టే యూజర్- జెనరేటెడ్ కంటెంట్ కంపెనీ ఎలాంటి బాధ్యతా వహించదు.
ఈ సేవా నిబంధనలను ఎప్పుడైనా వినియోగదారులకు నోటీసు లేకుండా మార్చడానికీ, సవరించడానికీ, జోడించడానికీ, సంస్కరించడానికీ కంపెనీకి హక్కు ఉంది. ఈ సేవా నిబంధనలను రెగ్యులర్‌గా తప్పకుండా సమీక్షించడానికీ, అటువంటి మార్పుల గురించి సకాలంలో గమనించేలా చూసుకోవడానికి వినియోగదారులు బాధ్యత వహించాలి. మార్పులు పోస్ట్ చేసిన తర్వాత వినియోగదారులు వెబ్సైట్ నిరంతర ఉపయోగంతో సవరించిన సేవా నిబంధనలను వారు అంగీకరిస్తారు.
ఇక్కడ ఉన్న ఏవైనా నిబంధనలు లేదా నిబంధనల యొక్క కఠినమైన పనితీరును నొక్కిచెప్పడంలో లేదా ఇక్కడ ఉన్న సరైన లేదా పరిష్కారాన్ని ఉపయోగించుకోవడంలో ఇరు పార్టీల్లో ఏ ఒక్కటి విఫలమైనా, భవిష్యత్తులో మాఫీగా గానీ లేదా అటువంటి నియమాలు, నిబంధనలూ, ఎంపిక, హక్కు లేదా పరిష్కారం విడిచిపెట్టడం వంటివిగా పరిగణించబడవు, పైగా అదే మరింత శక్తివంతంగానూ మరియు మరింత ప్రభావవంతంగానూ కొనసాగుతుంది. అటువంటి పార్టీ ద్వారా వ్రాతపూర్వకంగా వ్యక్తీకరించబడి, సంతకం చేయబడకపోతే ఏ నియమాలూ లేదా నిబంధనలకి సంబంధించి ఏ పార్టీకీ మినహాయింపు ఇవ్వబడదు.
ఈ వినియోగ నిబంధనలు (వెబ్సైట్ గోప్యతా విధానం, ఇమెయిల్ ద్వారా పంపబడినవి మొదలైనవాటితో కూడిన కంపెనీ పేర్కొన్న ఇతర నిబంధనలు) రమ్మీకల్చర్ వెబ్సైట్, దాని వినియోగానికి సంబంధించి ఇరు పార్టీల మధ్య అంగీకరించబడిన అన్ని నిబంధనల్నీ కలిగి ఉంటాయి. పార్టీల మధ్య అంతకు ముందున్న నిబంధనలు, షరతులను అధిగమించడం, మినహాయించడం జరుగుతుంది.
స్వచ్ఛంద రద్దు:
support@rummyculture.com కి మాకు ఒక ఇమెయిల్ పంపడం ద్వారా మీ కోరికను మాకు తెలియజేయడం ద్వారా, మీరు ఎప్పుడైనా వెబ్‌సైట్‌లోని సేవలను ఉపయోగించడాన్ని నిలిపివేయవచ్చు. అటువంటి సమయంలో, మీ యూజర్ అకౌంట్లో పాజిటివ్ విత్‌డ్రాయల్ క్యాష్ బ్యాలెన్స్ ఉంటే, మేము సంతృప్తికరమైన ధృవీకరణకు లోబడి, ఆన్లైన్ బదిలీ ద్వారా లేదా సకాలంలో చెక్ ద్వారా మీకు పంపిణీ చేస్తాము.
అకౌంట్ నిర్వహణ ఛార్జీలు, పని చేయని అకౌంట్ల మూసివేత:
మా గేమింగ్ సిస్టమ్స్‌కి చివరి లాగిన్ సమయం నుంచి 12 నెలల సమయం ముగిసినట్లయితే కస్టమర్ అకౌంట్ పనిచేయనట్టుగా పరిగణించబడుతుంది.
అలా పనిచేయని అకౌంట్‌కు నెలవారీ నిర్వహణ రు. 250/- వసూలు చేయబడుతుంది.
15 రోజుల కన్నా ఎక్కువ సమయానికి మెయింటెనెన్స్ ఫీజ్ వర్తింపజేయడంపై కస్టమర్ అకౌంట్ బ్యాలెన్స్ ప్రతికూలంగా ఉంటే, కస్టమర్ అకౌంట్ శాశ్వతంగా మూసివేయబడుతుంది.
మొబైల్ సంఖ్య ధృవీకరణ
రమ్మీకల్చర్‌లో మీరు క్యాష్ గేమ్స్‌ని ఆడడానికి మీ మొబైల్ నెంబర్ని ధృవీకరించాలి. రమ్మీకల్చర్‌లో ఏదైనా రూపంలో మోసాలు జరగకుండా చూసే విధానం ఇది. మీ సమాచారం అంతా గోప్యంగా ఉంచబడుతుంది & ఏ కారణంగానూ ఏ వ్యక్తికీ లేదా పార్టీకీ ఆ సమాచారం భాగస్వామ్యం చేయబడదు. రమ్మీకల్చర్‌లో మొబైల్ ప్రామాణీకరణ ప్రక్రియ క్యాష్ వినియోగదారులందరూ అనుసరించడం తప్పనిసరి ప్రక్రియ.
క్యాష్‌ను జోడించండి:
రమ్మీకల్చర్‌లో, మీరు రోజుకు రు.20,000 వరకు జమ చేయవచ్చు.
బోనస్ ఎలా పనిచేస్తుంది?
మీరు క్యాష్‌ను జోడించినప్పుడు లేదా మీ రమ్మీకల్చర్ అకౌంట్లో డిపాజిట్ చేసినప్పుడు, కొనసాగుతున్న ప్రమోషన్/ఆఫర్‌ని బట్టి మీకు నిర్దిష్ట బోనస్ కేటాయించబడుతుంది. బోనస్‌లో కొంత భాగం మీరు ఆడే ప్రతి క్యాష్ గేమ్ తర్వాతా రిలీజ్ చేయబడుతుంది, మొత్తం బోనస్ అంతా మీ అకౌంట్‌కు అలా జమ అయ్యే వరకు రిలీజ్ చేయబడుతూనే ఉంటుంది. బోనస్ ఒక నిర్దిష్ట వ్యవధిలో సంపాదించాలి (డిస్బర్స్ చేయబడాలి) అని గుర్తుంచుకోండి, ఇది ఆఫర్ ఆధారంగా భిన్నంగా ఉండవచ్చు.
ఉదాహరణకు – మీకు రు.100 బోనస్ ఉంటే మీరు డీల్స్ రమ్మీ గేమ్‌ను రు. 200, ఆపై రు.200 లో 10%, అనగా గేమ్ పూర్తయిన తర్వాత మీ విత్‌డ్రాయల్ బ్యాలెన్స్‌కు రు.20 బోనస్ జమ అవుతుంది. మీరు తదుపరి గేమ్ రు.500 ఆడితే, రు.500 లో 10%, అనగా రు.50 బోనస్ మీ విత్‌డ్రాయల్ బ్యాలెన్స్‌కు జమ అవుతుంది. మొత్తం బోనస్ మొత్తాన్ని విడుదల చేసే వరకు ఇలాగే కొనసాగుతుంది. ఆఫర్‌ని బట్టి రిలీజ్ చేసే శాతం/రేటు మారవచ్చు.
దయచేసి గమనించండి: రమ్మీకల్చర్‌లో ఒక ప్లేయర్‌కి ఒకే అకౌంట్ ఉంటుంది. మల్టిపుల్ అకౌంట్లు కనుగొనబడితే, అన్ని అకౌంట్ల్లోని మొత్తం బోనస్ అమౌంట్ రద్దు చేయబడుతుంది. రమ్మీకల్చర్‌లో అందించే అన్ని సేవలకు సేవా నిబంధనలు వర్తిస్తాయి. ఏ దశలోనైనా నిబంధనలను ఉల్లంఘిస్తే బోనస్ పొందకుండా అనర్హులు కావచ్చు.
పాలక చట్ట, వివాద పరిష్కారం & అధికార పరిధి:
నిబంధనలు మరియు గోప్యతా విధానం భారతదేశ చట్టలకు అనుగుణంగా వ్యాఖ్యానించబడుతుంది.
నిబంధనలు లేదా గోప్యతా విధానం నుంచి ఉత్పన్నమయ్యే ఏదైనా వివాదం, తగాదా లేదా దావా బెంగళూరులోని సివిల్ కోర్టుల ప్రత్యేక అధికార పరిధికి లోబడి ఉంటుంది.
సర్టిఫైడ్ రాండమ్ నెంబర్ జనరేటర్ (RNG)
మా రాండమ్ నెంబర్ జెనరేటర్ (ఆర్‌ఎన్‌జీ) ఐటెక్ ల్యాబ్స్ ద్వారా ధృవీకరించబడింది, ఇది ఆర్‌ఎన్‌జీ ధృవీకరణ కోసం ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతమైన అధికారం (ఐఎస్ఓ 17025 సర్టిఫైడ్) ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ కంపెనీలకు ఆర్‌ఎన్‌జీ సర్టిఫికెట్స్‌ని అందిస్తుంది. యాదృచ్ఛిక సంఖ్యలను రూపొందించడానికి RNG ఒక అల్గోరిథంను ఉపయోగిస్తుంది, ఇది అన్ని ప్లేయర్ బాగా షఫల్ చేసిన డెక్ నుంచి రేండమ్‌గా ఎంపిక చేయబడిన కార్డ్స్‌ని ఎలాంటి పక్షపాతం లేకుండా వేయబడేలా సిస్టమ్ ద్వారా న్యాయబద్ధంగా వ్యవహరించబడేలా చూస్తుంది. కాలిక్యులేషన్లను తగినంతగా ఇవ్వడానికి తగినన్ని పెద్ద నమూనాలపై షఫ్లింగ్ పరీక్షలు జరిగాయి. కార్డ్స్ సీక్వెన్సులు అనూహ్యమైనవి, పునరావృతం కానివి, యూనిఫాంగా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయని ఐటెక్ ల్యాబ్స్ కనుగొన్నది.